అనువాదలహరి

A poem about a poem… Si. Ra. Telugu, Indian

.

Let me tell you! These words are not so great.

Even if you don’t read this poem, you aren’t at loss.

It’s just a passel of words strewn carelessly…. and,

An inchoate song taking shape

By a chancy chancy alignment.

 

You ask me for its meaning?

Well, what meaning can you find behind

The rumbling waters of a stream,

For the fugacious leaves dropping dead in Fall,

For the heads severed in wars,

And for the tears of an oldie wailing in her sleep?

That’s why I say, don’t bother about this poem.

It’s not something you want to read.

 

This is just a crazy poem which speaks

About Pains, hardships, lives ruined,

About revolutions, upheavals, and dreamy new worlds;

Watching the world flowing by the road

It soliloquises constantly about these incongruences.

 

When the establishment rents you, breaks you to smithereens,

When an order alienates you from yourself

When a fact incinerates all your dreams reducing them to ashes

When the abounding ignorance of the world

Tries to overwhelm the truth known only to you,

Then come, and read this poem!

The tone, tenor and substance

Of this poem will be self-evident.

 

Till then,

This poem seems to you

A barking dog chasing after

Every damned vehicle running on the highway.

.

Si Ra.

Telugu, Indian

 

Si Ra. is the pseudonym of a youth in early twenties. True to the spirit of that age, the youth is very studious, passionate had spent a whole day watching the pictures of Salvador Dali; on another day watched the movies of Akira Kurosawa; spent another day in reading Rilke, listening to Bob Dylan’s songs another day, and reading Stephen Hawking’s A Brief History of Time some other day. The youth says, it woke through the night reading philosophy one day and Karl Marx on another.

About Si. Ra, the pseudonym, in the own words of the youth: “After all the above, I suddenly reinvented myself from a state of alienation. That is how Si Ra was born. Now it has become so powerful that at times it subordinates me. Three years after Si Ra was born, I started presenting my poetry in FB”

.

ఓ కవిత గురించి కవిత

.

ఇవిగో! ఈ అక్షరాలు అంత గొప్పవేమీ కాదు

ఈ కవిత చదవకపొయినా నష్టం ఏమీ జరగదు.

ఇది కేవలం విసిరేయబడ్డ పదాల సమూహం

యాదృచ్చికంగా కలిసిన అక్షరాలన్ని

అతుక్కోవటం వల్ల ఏర్పడిన నైరూప్య గీతం.

దీని అర్థమంటావా, నీళ్ళ అలజడులకు,

శరదృతువులో రాలిపడుతున్న ఆకులకు,

యుద్దంలో తెగిపడే తలలకూ,

నిద్రలో ఏడుస్తున్న ముసిలావిడ కన్నీటికి,

ఏం అర్థం ఉంటుంది?

అందుకే చెప్తున్నా, ఈ కవితని అంతగా పట్టించుకోకు,

ఇది నువ్వు చదవాలి అనుకుంటున్న కవిత కాదు.

 

బాధల గురించి, కష్టాల గురించి, ఛిద్రమైన జీవితాల గురించి

విప్లవాల గురించి, మార్పుల గురించి, మరో ప్రపంచం గురించి,

రోడ్డు పక్కన ప్రవహిస్తున్న ప్రపంచాన్ని చూస్తూ

ఇలాంటి అనర్థాల గురించి నిత్యం తనలోతాను మాట్లాడుతూ

గడిపే పిచ్చిది ఈ కవిత.

ఎప్పుడైతే ఒక వ్యవస్థ నిన్ను చింపి ముక్కలుముక్కలు చేస్తుందో

ఒక పద్దతి నిన్ను నీ నుండి దూరం చేస్తుందో,

ఒక వాస్తవం నీ స్వప్నాలన్నిటినీ కాల్చేస్తుందో

నీకు మాత్రమే తెలిసిన జ్ఞానాన్ని ప్రపంచపు అజ్ఞానం మింగేయలని చూస్తుందో

అప్పుడు వొచ్చి ఈ కవితను చదువు.

ఈ కవితలోని అర్థం, రూపం, రాగం

అవంతటవే బోధపడుతాయి.

అప్పటివరకు ఈ కవిత నీకు రహదారిలో

ప్రతి వాహనాన్ని వెంటబడే

కుక్కలాగనే కనిపిస్తుంది.

.

సి రా

%d bloggers like this: