మూడు బొంతకాకులు … అజ్ఞాత కవి , 17 వ శతాబ్దం మూడు బొంతకాకులు చెట్టుమీద కూచున్నాయి, అవి ఎంతనల్లగా ఉండగలవో అంత నల్లగా ఉన్నాయి. అందులో ఒకటి మిగతావాటితో అంది: “మనం ఊదయాన్నే ఫలహారం ఎక్కడ చెయ్యడం?” అని “అదిగో! దూరాన పచ్చనిపొలాల్లో ఒక వీరుడు చనిపోయి తన డాలుక్రింద పడి ఉన్నాడు.” “లాభం లేదు. అతని వేట కుక్కలు పాదాల చెంత ఉన్నాయి. అవి తమ యజమానిని జాగ్రత్తగా కాపాడతాయి.” అతని పెంపుడు డేగలు ఆకాశంలో పహారా కాస్తున్నాయి అతని దగ్గరకి ఏ పక్షీ రానియ్యవు. కొంతసేపటికి అతని ప్రియురాలు వచ్చింది వయసులో ఎంత అందంగా ఉండాలో అంత అందంగా ఉంది. అతని రక్తమోడుతున్న తలని పైకి ఎత్తింది. తడి ఆరని అతని గాయాల్ని ముద్దు పెట్టుకుంది. అతన్ని తన భుజానికి ఎత్తుకుంది దగ్గరనే ఉన్న సెలయేటిదగ్గరకి తీసుకెళ్ళింది. ప్రభాతవేళ కాకుండా అతన్ని ఖననం చేసింది సంధ్యావందనం వేళకి తనూ ప్రాణం త్యజించింది. ప్రతి సాధుపురుషుడికీ భగవంతుడు అటువంటి వేటకుక్కల్నీ, డేగల్నీ, ప్రియురాళ్ళనీ అనుగ్రహించుగాక! . అజ్ఞాత కవి 17 వ శతాబ్దం . The Three Ravens . There were three ravens sat on a tree, They were as black as they might be. The one of them said to his make, ‘Where shall we our breakfast take?’ ‘Down in yonder greene field There lies a knight slain under his shield; ‘His hounds they lie down at his feet, So well they can their master keep; ‘His hawks they flie so eagerly, There ‘s no fowl dare come him nigh.’ Down there comes a fallow doe As great with young as she might goe. She lift up his bloudy head And kist his wounds that were so red. She gat him up upon her back And carried him to earthen lake. She buried him before the prime, She was dead herself ere evensong time. God send every gentleman Such hounds, such hawks, and such a Leman . Anonymous 17th Century Poem Courtesy: The Oxford Book of English Verse: 1250–1900 Ed. Arthur Quiller-Couch. Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 1 వ్యాఖ్యజూన్ 7, 2014