అనువాదలహరి

కొత్త సిపాయిలు… అజ్ఞాత కవి, రుథేనియన్

కొండవాలులో మంఛుపేరుకుని ఉంది,

కాని తర్వాత కరిగి వాగులై ప్రవహిస్తుంది.

రోడ్డుపక్కన పాపీలు విరగవూసాయి…

అవి పాపీలేనా? కాదు, అవి ఎర్రగా మెరుస్తున్నాయి గాని,

ఓహ్, అవి పువ్వులు కవు, సైన్యంలోకి కొత్తగా చేరిన సిపాయిలు!

వాళ్ళు కొత్తగా చేరిన యువ సిపాయిలు!

వాళ్ళు క్రిం (Krym) దాకా

ఒకరివెనక ఒకరు స్వారీచేస్తూ వెళ్తారు,

ఆ విశాలమైన పల్లెసీమలో

గుర్రపు డెక్కల చప్పుడు ప్రతిధ్వనిస్తుంది.

ఇంతలో ఒక తల్లి పిలుపు వినిపిస్తుంది:

ఒరేయ్ శ్రద్ధమాలినవాడా! వెనక్కి రా

పళ్లుతోముకున్నావా?

ఒక సారి తలంటుతాను… వేగిరం పరిగెత్తుకు రా!”

లాభం లేదమ్మా! నువ్వే తలరుద్దుకో,

లేకపోతే, చెల్లికి తలరుద్దు ఏడ్చీలా.

నన్ను నామానాన్న ఒదిలెయ్.

కాలం ఇట్టే పరిగెడుతుంది. త్వరలో వచ్చెస్తా.

నా బుర్రని తొలకరి వాన

శుభ్రంగా తలంటినట్టు కడిగేస్తుందిలే.

ఒకవేళ ఎక్కడైనా జుత్తు చిక్కుపడితే

పొడవాటి ముళ్ళు ఉన్నాయిలే, సాఫుగా దువ్వుకుందికి.

ఎండకి అదే ఆరిపోతుంది,

గాలికి అదే క్రాఫులా రెండు పాయలుగా ఉంటుంది.

అమ్మా, ఉంటాను, సెలవు

….

అతనికి ఆమె ఏడుపు వినిపించలేదు.

.

అజ్ఞాత కవి

రుథేనియన్

అనువాదం: ఫ్లారెన్స్ రేండల్ లివ్జే, కెనడా.

.

.

The Young Recruits

(Cossack Song)

.

Along the hills lies the snow,

But the streams they melt and flow;

By the road the poppies blow–

Poppies? Nay, scarlet though they glow,

These are no flowers–the young recruits!

  They are the young recruits!

 

  To Krym, to Krym they ride,

  The soldiers, side by side–

  And over the country wide

  Sounds the beat of the horse’s stride.

One calls to her soldier son:

‘Return, O careless one!

Of scrubbing wilt have none?

Let me wash thy head–then run!’

‘Nay, mother, wash thine own,

Or make my sister groan.

Leave thou thy son alone!

Too swift the time has flown.

‘My head the fine spring rain

Will soon wash clean again,

And stout thorns will be fain

To comb what rough has lain.

‘The sun will make it dry,

Wind-parted it will lie–

So, mother mine, good-bye!’

. . . . .

He could not hear her cry.

.

Anonymous .

(Translated from Ruthenian by: Florence Randal Livesay, Canadian)

Poem Courtesy: http://digital.library.upenn.edu/women/garvin/poets/livesay.html

%d bloggers like this: