అనువాదలహరి

There is Nothing Much To Say…. Nanda Kishore, Telugu, Indian

  1

Now there are only two tenses…

The times when I loved her,

and the times when I can’t help loving her.

 

2

It never occurred to me how time would pass without her;

All these days, amidst enveloping despair,

I could understand I was better off because of her,

But strange, I could never understand her.

 

3

People say that I had changed remarkably since her friendship.

Very True. My lyric is for her; and my song is for her;

I kindle my heart and await her in darkness.

I assume a different bod every day and incinerate.

It’s beyond anybody to imagine

The tragedy in possessing her and the blessing in losing.

 

4

Maybe, that there was life before seeing her is a fact.

But that was inanimate;

What if she had left me with a wound?

There’s pleasure in reminiscing her

for turning me into a being.

.

Nanda Kishore

Telugu

Indian

 

Image courtesy: Nanda Kishore
Image courtesy: Nanda Kishore

 

చెప్పడానికేం లేదు.

 

1

ఉన్నవి రెండు కాలాలు. ఆమెని ప్రేమించిన కాలం. ప్రేమించకుండా ఉండలేని కాలం.

2

ఆమెలేని రోజులు ఎలా గడుస్తాయనే ఆలోచన వచ్చేది కాదు. ఇన్ని రోజులు, ఇంతనిరాశలోనూ ఆమె ఉన్నందుకే నేను బాగున్నానని తెలుసుకున్నాను కాని ఆమెనితెలుసుకోలేదు.

3

ఆమె పరిచయంతోనే ఇంతగా మారనంటారు కొందరు.నిజమే, ఆమె కోసమే రాస్తాను. ఆమెకోసమే పాడతాను. ఆమెకోసం చీకట్లో హృదయంవెలిగించుకు నిల్చుంటాను. ఆమెకోసం ప్రతిరాత్రి కొత్త దేహమై దహించుకుపోతాను.నన్ను కోల్పోవటంలోని సంతోషం, ఆమె దక్కడంలో ఉన్న విషాదం ఎవరూ ఊహించలేనిది.

4

ఆమెకి ముందు ఉన్న జీవితమే వాస్తవమై ఉండొచ్చు. అది ప్రాణంలేనిది. గాయంచేసినా సరే, ప్రాణస్పృహ కల్గించిన ఆమెని గుర్తుచేసుకోవటంలో ఆనందం ఉంటది.

.

నంద కిషోర్

తెలుగు

భారతీయ కవి

02-06-14

%d bloggers like this: