అనువాదలహరి

జీవిత సంగ్రహం … జిస్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి

నువ్విప్పుడు ఏంచెయ్యాలి?

ఒక దరఖాస్తు నింపి

దానికి నీ జీవిత సంగ్రహాన్ని జతపరచాలి,

నీ జీవితం ఎంత దీర్ఘమైనది అన్న నిమిత్తం లేకుండా

నీ జీవిత సంగ్రహం చాలా సంక్షిప్తంగా ఉండాలి.

కనుక క్లుప్తత పాటించి, వాస్తవాలనే ఎంచుకో.

దృశ్యాలని  చిరునామాలుగా మార్చు,

లీలగా ఉన్న జ్ఞాపకాలని తారీకులుగా మార్చు,

పెళ్ళి చేసుకున్నవారినే ఉటంకించు,

పిల్లలలోకూడ

పుట్టిన వాళ్లనే చూపించు.

నీ కెవరు తెలుసునన్నదానికంటే

నిన్నెవరికి తెలుసో చాలా ముఖ్యం.

ప్రయాణాలు…. విదేశప్రయాణాలయితేనే,

అనుబంధాలు— దేనితోనో చెప్పు, ఎందుకో కాదు.

పురస్కారాలు— ఎన్నో చెప్పు, ఎందుకో అక్కరలేదు

నీతో నువ్వెన్నడూ మాటాడుకోనట్టూ,

నిన్ను నువ్వు దూరంనుండి సమీక్షిస్తున్నట్టు రాయి.

నీ పెంపుడు కుక్కలూ, పిల్లులూ, పక్షులూ,

నీ జ్ఞాపికలూ, మిత్రులూ, కలల గురించి ప్రస్తావించకు.

విలువతో నిమిత్తం లేకుండా ధర ఒక్కటే చూపించు,

పుస్తకాలలో ఏముదన్నదానికంటే, పేర్లు పేర్కో.

నువ్వు నిజానికి ఎక్కడకి చేరుకోవాలో 

గమ్యం ఏమిటో కాకుండా, నీ షూ సైజు చెప్పు,

ఒక చెవి కనిపించేలా ఫొటో జతపరచు.

దాని ఆకారమే ప్రధానం, అది ఏమి వింటుందో కాదు.

మహా అయితే అదేమిటి వినగలదు?

యంత్రాల సణుగుడూ, చిత్తు కాగితాల చప్పుడూ తప్ప!

.

జిస్వావా షింబోర్స్కా

(2 July 1923 – 1 February 2012)

పోలిష్ కవయిత్రి

.

Image Courtesy: http://upload.wikimedia.org

Wislawa Szymborska

Image Courtesy: http://upload.wikimedia.org

.

Writing A Curriculum Vita

.

What must you do?

You must submit an application

and enclose a Curriculum Vitae.

Regardless of how long your life is,

the Curriculum Vitae should be short.

Be concise, select facts.

Change landscapes into addresses

and vague memories into fixed dates.

Of all your loves,

mention only the marital, a

nd of the children,

only those who were born.

It’s more important

who knows you than whom you know.

Travels––only if abroad.

Affiliations––to what, not why.

Awards––but not for what.

Write as if you never talked with yourself,

as if you looked at yourself from afar.

Omit dogs, cats, and birds,

mementos, friends, dreams.

State price rather than value,

title rather than content.

Shoe size, not where one is going,

the one you are supposed to be.

Enclose a photo with one ear showing.

What counts is its shape, not what it hears.

What does it hear?

The clatter of machinery that shreds paper.

.

Wislawa Szymborska 

(2 July 1923 – 1 February 2012)

Polish Poetess

Translated from Polish by

Graźyna Drabik and Austin Flint.

%d bloggers like this: