అనువాదలహరి

భావ శకలం 2 … జకోమో లెపార్డి , ఇటాలియన్ కవి

మనిషికి చెందిన ఏదైనా క్షణికమే:

ఖీయోస్(Chios) కి చెందిన ఆ అంధకవి*

నిజమే చెప్పాడు:

చెట్ల ఆకులూ, మానుషప్రకృతీ

ఒకే ధర్మాన్ని కలిగి ఉన్నాయి.

కాని, ఈ మాటలని

పట్టించుకునే వాళ్లు తక్కువ.

అందరికీ, చపలమైన ఆశ,

వయసు తమతో శాశ్వతంగా ఉంటుందని.

మన యవ్వనపుష్పం పచ్చగా

అందంగా మెరుస్తూ కనిపిస్తే

గర్విష్ఠి అయిన విశృంఖల ఆత్మ

వృధాగా అనేక అందమైన ఊహలు ఊహిస్తుంది

వయసూ, మృత్యువు అన్న ధ్యాస లెకుండా,

ఆరోగ్యంగా, బలంగా ఉన్నప్పుడు రోగాం గూర్చి చింతలేకుండా.

కానీ, వయసు దాని రెక్కలు ఎంతత్వరగా ముడుచుకుంటుందో

ఎవడు ముందుగా ఊహించలేడో, వాడు మూర్ఖుడు.

ఊయల చితికి

ఎంత చేరువో తెలుసుకోలేడు కదా!

యమపురికి త్వరలో

మృత్యుమార్గంలో ప్రయాణించవలసిన మనిషి

నశ్వరమైన జీవితాన్ని

ఆనందానికి అంకితం చేస్తున్నాడు.

.

(* Note: ఖీయోస్(Chios) కి చెందిన ఆ అంధకవి* : Homer)

.

జకోమో లెపార్డి

June 29, 1798 – June 14, 1837

ఇటాలియన్ కవి.

                                          Giacomo Leopardi

                                            Italian Poet

.

Fragment (From Simonides II:XLI)

 .

Things human last so short a time:

he spoke true

the blind poet of Chios:

similar in nature are

the leaves, and humanity.

But there are few who take

these words to heart. All have

unquiet hope, the child

of youth, to live with them.

While the flower of our

green age shows bright,

the free, proud soul

vainly feeds a hundred sweet thoughts,

not knowing death or age: in health

and strength a man cares nothing for disease.

But he’s a fool who cannot see

how swiftly youth beats its wings,

how close the cradle

is to the pyre.

You, about to tread

the fatal path

to Pluto’s realms:

to present delight

commit brief life.

 .

(Note. The blind poet of Chios is Homer.)

.

Giacomo Leopardi

June 29, 1798 – June 14, 1837

Italian

Translation by: A. S. Kline

Poem Courtesy:

http://www.poetryintranslation.com/PITBR/Italian/Leopardi.htm#_Toc38684175

 

 

 

%d bloggers like this: