అనువాదలహరి

వియోగవేళ… ఆలివ్ ఎలినార్ కస్టాన్స్, బ్రిటిషు కవయిత్రి

లేదు, ప్రియతమా! లేదు, సూర్యుడింకా నెత్తిమీదే ఉన్నాడు,

నిన్న రాత్రి నువ్వు, “సూర్యాస్తమయం తర్వాత” కదా వెళతా నన్నావు.

తోటలోకి రా, అక్కడ పూలు వాడిపోతుంటే

నోటమాట రాదు;  బహుశా అదే మంచిది:

అబ్బా! ఎంత భరింపరానిది “వీడ్కోలు” అన్న మాట!

విను! పక్షులు ఎంత మధురంగా వసంతగీతాలాలపిస్తున్నాయో!

త్వరలో అవి గూళ్ళు కట్టుకుంటాయి, ఆ శ్రమలో మౌనం ఆవహిస్తుంది

మనం కూడా వయసువస్తున్నకొద్దీ ఉల్లాసాన్ని మరిచిపోతాం

జీవితపు బాధ్యతలు నెత్తిమీద పడి… వాటితో పాటే

బాధాకరమైన “వీడ్కోలు” అన్న మాట కూడా.

నీ పాదాల క్రింద సువాసనలు వెదజల్లడానికి పూలు ఆరాటపడుతున్నాయి

పసిడి రంగు ఎండ దివి నుండి నీ కురులపై వాలుగా పడుతోంది;

నాకు ఏ పువ్వూ వద్దు; నీ అధరాలే అన్నిటికన్నా మధురం,

నా పెదాలు అక్కడ తచ్చాడుతున్నప్పుడు,

ప్రేమకి శాపమైన “వీడ్కోలు ” అన్నమాట మరిచిపోవుగాక.

అప్పుడే సూర్యాస్తమయం అయిందా? అంతసేపు కూర్చున్నామా?

చెప్పవలసినవి ఇంకా చాలా ఉన్నాయి, అప్పుడే వియోగవేళ అయిందా?

తోట ఎలా మూగపోయిందో! పాట ఎక్కడా వినిపించడం లేదు,

మన విషాదం మనల్ని ఒక ఆకస్మిక భయంతో కలవరపెడుతోంది

అబ్బా! ఎంత భరింపరానిది “వీడ్కోలు ” అన్న మాట!

.

ఆలివ్ ఎలినార్ కస్టాన్స్

(7 February 1874 – 12 February 1944)

బ్రిటిషు కవయిత్రి

.

 

Olive Eleanor Custance

.

The Parting Hour

.

Not yet, dear love, not yet; the sun is high,

You said last night,”At sunset I will go.”

Come to the garden, where when blossoms die

No word is spoken; it is better so :

Ah! bitter word “Farewell.”

Hark! how the birds sing sunny songs of spring!

Soon they will build, and work will silence them,

So we grow less light-hearted as years  bring

Life’s grave responsibilities— and then

The bitter word “Farewell.”

The violets fret to fragrance ‘neath your feet,

Heaven’s gold sunlight dreams aslant your hair:

No flower for me, your mouth is far more sweet.

O, let my lips forget, while lingering there,

Love’s bitter word “Farewell.”

Sunset already! have we sat so long?

The parting hour and so much left unsaid!

The garden has grown silent— void of song,

Our sorrow shakes us with a sudden dread

Ah! bitter word “Farewell.”

.

Olive Eleanor Custance

(7 February 1874 – 12 February 1944)

British Poet

 

Poem Courtesy:

The Homebook of Verse, American and English, 1580-1918

https://archive.org/stream/homebookofversea00stev#page/985/mode/1up

 

 

%d bloggers like this: