అనువాదలహరి

కోయిలా- మిణుగురూ… విలియం కౌపర్, ఇంగ్లీషు కవి.

పగలల్లా ఆ పల్లెని

తనపాటతో మురిపించిన ఒక కోయిల

ఇంకా పూర్తిగా చీకటి పడనే లేదు

తన పాట ఆపడం ఇంకా పూర్తవనే లేదు,

అప్పుడే, దాని శ్రమకి తగ్గట్టుగా

కడుపులో ఆకలి వెయ్యడం మొదలైంది.

ఆశగా నాలుగుపక్కలా పరికించి చూస్తే

దూరంగా, నేలమీద ఏదో కనిపించింది

చీకటిలో మిణుకుమిణుకు మెరుస్తూ,

దాని వెలుగును బట్టి పోల్చుకుంది మిణుగురని;

మామిడి కొమ్మ మీంచి క్రిందకి వాలింది,

దాన్ని పొట్టలో వేసుకుందామే తరవాయి.

 

కోయిల ఉద్దేశ్యాన్ని గ్రహించిన ఆ కీటకం

దానితో ఇలా వాదించింది, తడబడకుండా:

“నీ పాటని నేను మెచ్చుకున్నంతగా,

నువ్వు నా వెలుగుల్ని మెచ్చుకుని ఉంటే,

నీ పాటకి నేనెలా ఆటకం కలిగించ ఇష్టపడనో

నాకు హాని తలపెట్టే ఆలోచన నీకు వచ్చేది కాదు.

ఎందుకంటే, నీకు పాటనేర్పి, నాకు మెరుపునిచ్చి

రాత్రిని నీ పాటతో, నా వెలుగులతో

రంజింపజేసేలా శాసించింది ఒకే దివ్య శక్తి.  

కోయిల దాని క్లుప్తమైన వాదనను విని

సమ్మతిసూచకంగా మధురంగా కూసి

దాన్ని విడిచిపెట్టింది,

ఇంకోచోట భోజనాన్ని వెతుక్కుంది.

కనుక, ఒకే దేముడి గురించి తన్నుకునేవాళ్ళు

నిజంగా తెలుసుకోవలసిందొకటుంది;

ఒక సోదరుడు ఇంకో సోదరుడితో పోట్లాడకూడదు,

హింసించుకుని, ఒకర్నొకరు నాశనం చేసుకో కూడదు.

ఒకరి అభిప్రాయాలు ఒకరు మన్నిస్తూ,

ప్రకృతి ప్రసాదించిన వరాల్నీ, ఆశీస్సుల్నీ హర్షిస్తూ

బుద్బుదప్రాయమైన ఈ చీకటి జీవిత ఖైదు ముగిసేదాకా

అన్యోన్య అవగాహనతో ఆడుతూ పాడుతూ ఉండాలి

ఎవరైతే పట్టుదలగా శాంతి ప్రయత్నాలు చేస్తారో

వాళ్ళే క్రిస్టియన్లు అనిపించుకుందికి అర్హులు.

ఆకాశంలో విహరించినవారికీ, నేలమీద నడిచేవాడికీ

శాంతి సాధన … ఎంత వరమో,  అంత కర్తవ్యం కూడా.

విలియం కౌపర్,

26 November 1731 – 25 April 1800

ఇంగ్లీషు కవి.

.

William Cowper

.

The Nightingale and the Glow-worm

.

A Nightingale, that all day long

Had cheered the village with his song

Nor yet at eve his note suspended

Nor yet at eventide was ended

Began to feel, as well he might,

The keen demands of appetite;

when, looking eagerly around,

He spied far off, upon the ground,

A something shining in the dark,

And knew the glow-worm by his spark;

So, stooping down from the hawthorn top,

He thought to put him in his crop.

The worm aware of his intent,

harangued him thus, right eloquent:

“Did you admire my lamp?” quoth he,

“As much as I your minstrelsy,

you would abhor to do me wrong

As much as I to spoil your song;

For ‘t was the self-same Power Divine

Taught you to sing, and me to shine;

That you with music, I with light,

Might beautify and cheer the night.”

The songster heard his short oration,

warbling out his approbation,

released him, as my story tells,

And found a supper somewhere else.

Hence the jarring sectaries may learn

Their real interest to discern;

That brother should not war with brother,

And worry and devour each other;

But sing and shine by sweet consent

Till life’s poor transient night is spent,

Respecting in each other’s case

The gifts of nature and of grace.

Those christians best deserve the name

who studiously make peace their aim;

Peace both the duty and the prize,

of him that creeps and him that flies.

.

William Cowper

26 November 1731 – 25 April 1800

English Poet  

 Poem Courtesy: https://archive.org/stream/homebookofversea00stev#page/179/mode/1up

 

%d bloggers like this: