కార్డినల్ న్యూమన్ స్మృతికి … క్రిస్టినా రోజేటి ఇంగ్లీషు కవయిత్రి
(సమాధిలో నువ్వెక్కడకి పోగలవు.)
.
శిలువ తరఫున పోరాడి అలసిన యోధుడా, విశ్రమించు,
తుదకు అన్నిటినీ అక్కునచేర్చుకునే నిద్ర, నిద్రపో;
నువ్వు నాట్లువేసిన రోజు సుదీర్ఘమయినది, నిద్రించి ప్రతిఫలం అందుకో,
నువ్వు చాలా కాలం ఉపవశించేవు, నీ ఆత్మతృప్తిగా విందు భోజనం చెయ్యి.
అవును, ప్రేమ నిండుగా అనుభవించడం నీవంతు,
ఎందుకంటె, నువు కనపరిచినప్రేమ, పైపైది కాదు, లోతైనది,
నీ ప్రేమ నిండుపున్నమనాటి పోటువంటిది, కొంచెపునరుల
పిల్లకాలవలలు నీ వరద ముందు దిగదిడుపే.
నీకిపుడు రాత్రి అయింది, భగవంతునిలో ఇపుడు విశ్రమించు.
ఎప్పుడో ఒకప్పుడు ప్రతిమనిషికీ రావలసిందే;
కొందరికి ఇదే మొదలూ తుదీ, చాలమందికి ఎన్నో మృత్యువులలో ఇదొకటి
నీ అమరత్వపు ప్రణాళికలన్నీ ఖరారయినట్టే
నీ ఉత్తమము ఉత్తమోత్తమంగా పనిచేస్తే, అధమం అందులో అధమం;
కనుక భగవంతుడా, నీ ఉత్తమం ఉత్తమోత్తమంగా అతనికి పనిచెయ్యనీ.
.
క్రిస్టినా రోజేటి
(5 December 1830 – 29 December 1894)
ఇంగ్లీషు కవయిత్రి
.
కార్డినల్ న్యూమన్ గురించి ఇక్కడ చదవండి
.
Cardinal Newman
(“In the grave, whither thou goest.”)
.
O Weary Champion of the Cross, lie still:
Sleep thou at length the all-embracing sleep:
Long was thy sowing day, rest now and reap:
Thy fast was long, feast now thy spirit’s fill.
Yea, take thy fill of love, because thy will
Chose love not in the shallows but the deep:
Thy tides were springtides, set against the neap
Of calmer souls: thy flood rebuked their rill.
Now night has come to thee—please God, of rest:
So some time must it come to every man;
To first and last, where many last are first.
Now fixed and finished thine eternal plan,
Thy best has done its best, thy worst its worst:
Thy best its best, please God, thy best its best
Christina Georgina Rossetti
(5 December 1830 – 29 December 1894)
English Poetess
Women Poets of the Nineteenth Century. 1907
Ed. Alfred H. Miles.
http://www.bartleby.com/293/196.html
నిర్భాగ్యుడి మరణశయ్య… కెరొలీన్ ఏన్ సదే, ఇంగ్లీషు కవయిత్రి
మెల్లగా అడుగులెయ్యండి… తల వంచుకొండి
గౌరవపురస్సరంగా తల అవనతం చెయ్యండి
ఇక్కడ ఏ గుడిగంటలూ మోగవు…
అయినా ఒక అమర్త్యాత్మ
శరీరంనుండి నిష్క్రమించబోతోంది.
ఓ తెరువరీ! నువ్వు ఎంతో గొప్పవాడివై ఉండొచ్చు
అయినా, కనీసగౌరవంతో తల వంచుకో;
ఆ పాడుబడ్డ పూరిపాకలో…
ఆ నామమాత్రమైన పక్కమీద
నీకంటే గొప్పవాడు పరున్నాడు.
ఆ బిచ్చగాడి గుడిశలో
మృత్యువు రాజసాన్ని ప్రదర్శిస్తోంది.
ఎవరూ లేరులే… లోపలికి నడు
ఈ రాజమందిరానికి ఎవరూ కాపలా లేరులే
లోపలికి తొంగిచూడు
చెమ్మగా చల్లగా ఉన్న కాలిబాటమీద
కులాసాగా ఏ రాజప్రుప్రముఖులూ నడవరు;
బలహీనమైన చేతులతో
మృత్యువాతపడుతున్న ఆ తలని
ఒక స్త్రీ ఎత్తిపట్టుకుంటోంది.
ఏ ఆప్తుల రోదనలూ వినిపించడం లేదు
ఒంటరిగా వినిపిస్తున్న పసిపాప ఏడుపు తప్ప;
అణుచుకున్న ఒక వెక్కు… ఆ వెనక
దీర్ఘంగా తీసి ఒక్కసారి వదిలిన శ్వాస… అంతే!
ఒక మూలుగు… దానితోపాటే ప్రాణం నిర్గమన.
ఓహ్! ఎంత వింత మార్పు!
ఒక్క సారి జైలు గోడలు బద్దలయ్యాయి;
ఈ క్షణం వరకు, బాధతో
కృశించి కృశించి, మరుక్షణంలో
తారానివహాలకావల!
ఒహ్, ఎంత మార్పు! అద్భుతమైన మార్పు!
ఇప్పుడక్కడ ఆత్మ గతమైన మట్టిముద్ద మిగిలింది;
శాశ్వతమైన సూర్యోదయం అయింది…
ఇప్పుడొక అనశ్వర మూర్తి నిద్రలేచాడు…
తన దైవంలో మేల్కొన్నాడు.
.
కెరొలీన్ సదే,
(6th Dec 1786 – 20th July 1854)
ఇంగ్లీషు కవయిత్రి
.
.
The Pauper’s Death-bed
.
Tread softly—bow the head—
In reverent silence bow—
No passing bell doth toll—
Yet an immortal soul
Is passing now.
Stranger! however great,
With lowly reverence bow;
There’s one in that poor shed—
One by that paltry bed—
Greater than thou.
Beneath that beggar’s roof,
Lo! Death doth keep his state:
Enter—no crowds attend—
Enter—no guards defend
This palace gate.
That pavement damp and cold
No smiling courtiers tread;
One silent woman stands
Lifting with meagre hands
A dying head.
No mingling voices sound—
An infant wail alone;
A sob suppressed—again
That short deep gasp, and then
The parting groan.
Oh, change! oh, wondrous change!
Burst are the prison bars:
This moment there, so low,
So agonised, and now
Beyond the stars!
Oh, change! stupendous change!
There lies the soulless clod;
The Sun eternal breaks—
The new Immortal wakes—
Wakes with his God!
.
Caroline Anne (Bowles) Southey
(2nd Wife of Robert Southey)
English Poetess
(6th Dec 1786 – 20th July 1854)
Poem Courtesy:
Women Poets of the Nineteenth Century. 1907.
Ed. By. Alfred H. Miles
(http://www.bartleby.com/293/29.html%5B)
వియోగవేళ… ఆలివ్ ఎలినార్ కస్టాన్స్, బ్రిటిషు కవయిత్రి
లేదు, ప్రియతమా! లేదు, సూర్యుడింకా నెత్తిమీదే ఉన్నాడు,
నిన్న రాత్రి నువ్వు, “సూర్యాస్తమయం తర్వాత” కదా వెళతా నన్నావు.
తోటలోకి రా, అక్కడ పూలు వాడిపోతుంటే
నోటమాట రాదు; బహుశా అదే మంచిది:
అబ్బా! ఎంత భరింపరానిది “వీడ్కోలు” అన్న మాట!
విను! పక్షులు ఎంత మధురంగా వసంతగీతాలాలపిస్తున్నాయో!
త్వరలో అవి గూళ్ళు కట్టుకుంటాయి, ఆ శ్రమలో మౌనం ఆవహిస్తుంది
మనం కూడా వయసువస్తున్నకొద్దీ ఉల్లాసాన్ని మరిచిపోతాం
జీవితపు బాధ్యతలు నెత్తిమీద పడి… వాటితో పాటే
బాధాకరమైన “వీడ్కోలు” అన్న మాట కూడా.
నీ పాదాల క్రింద సువాసనలు వెదజల్లడానికి పూలు ఆరాటపడుతున్నాయి
పసిడి రంగు ఎండ దివి నుండి నీ కురులపై వాలుగా పడుతోంది;
నాకు ఏ పువ్వూ వద్దు; నీ అధరాలే అన్నిటికన్నా మధురం,
నా పెదాలు అక్కడ తచ్చాడుతున్నప్పుడు,
ప్రేమకి శాపమైన “వీడ్కోలు ” అన్నమాట మరిచిపోవుగాక.
అప్పుడే సూర్యాస్తమయం అయిందా? అంతసేపు కూర్చున్నామా?
చెప్పవలసినవి ఇంకా చాలా ఉన్నాయి, అప్పుడే వియోగవేళ అయిందా?
తోట ఎలా మూగపోయిందో! పాట ఎక్కడా వినిపించడం లేదు,
మన విషాదం మనల్ని ఒక ఆకస్మిక భయంతో కలవరపెడుతోంది
అబ్బా! ఎంత భరింపరానిది “వీడ్కోలు ” అన్న మాట!
.
ఆలివ్ ఎలినార్ కస్టాన్స్
(7 February 1874 – 12 February 1944)
బ్రిటిషు కవయిత్రి
.
Olive Eleanor Custance
.
The Parting Hour
.
Not yet, dear love, not yet; the sun is high,
You said last night,”At sunset I will go.”
Come to the garden, where when blossoms die
No word is spoken; it is better so :
Ah! bitter word “Farewell.”
Hark! how the birds sing sunny songs of spring!
Soon they will build, and work will silence them,
So we grow less light-hearted as years bring
Life’s grave responsibilities— and then
The bitter word “Farewell.”
The violets fret to fragrance ‘neath your feet,
Heaven’s gold sunlight dreams aslant your hair:
No flower for me, your mouth is far more sweet.
O, let my lips forget, while lingering there,
Love’s bitter word “Farewell.”
Sunset already! have we sat so long?
The parting hour and so much left unsaid!
The garden has grown silent— void of song,
Our sorrow shakes us with a sudden dread
Ah! bitter word “Farewell.”
.
Olive Eleanor Custance
(7 February 1874 – 12 February 1944)
British Poet
Poem Courtesy:
The Homebook of Verse, American and English, 1580-1918
https://archive.org/stream/homebookofversea00stev#page/985/mode/1up
సౌందర్యం… ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్, అమెరికను
సౌందర్యం సత్యం యొక్క వన్నెగాని, మెరుగు గాని కాదు
అది మనిషి ఆనందం కోసం సృష్టించబడిందీ కాదు.
ఆ మాటకొస్తే, స్వర్గంలోని కిటికీలగుండా సుదూరంగా చూస్తే
నరకం కూడా చాలా సుందరంగా కనిపిస్తుంది.
.
ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్
అమెరికను.
( సూచన:
ఈ వ్యక్తి ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అవడానికి అవకాశాలు కనిపించడం లేదు.
1917 ఆగష్టు సంచికలో ఈ కవిత పడే నాటికి హిచ్ కాక్ కి 18 నిండలేదు.
1919 తర్వాతే అతనిలోని సాహిత్య సృజన The Henley Telegraph, లోని రచనలద్వారా బయటకి వచ్చింది.
కాని అదికూడా కథలద్వారానే.
అయితే, ఈ కవి ఎవరో సాధికారికమైన సమాచారం నాకు దొరక లేదు.
అతను అమెరికను అన్నది కూడా నా ఊహ మాత్రమే. )
.
Beauty
Beauty is not the hue and glow of right,
Nor for man’s pleasure given.
Even Hell itself is beautiful at night
From the far windows of Heaven.
.
Alfred Hitch
American
Poem Courtesy
Poetry: A Magazine of Verse. 1912–22.
Harriet Monroe, ed. (1860–1936).
Volume X. No. 5. August, 1917
(Note: It is very unlikely that the person is same as the noted suspense thriller movie producer and Director Alfred Hitchcock. Because, at the time of publication of this poem he did not turn 18. Hitchcock’s writing skills were first known to the world through his writings to The Henley Telegraph… but even those were only short stories.
However, I don’t have authentic information about this poet. That he is American is only my guess and not based on any authority.)
క్షీణచంద్రుడు… షెల్లీ, ఇంగ్లీషు కవి
1
పలుచని మేలిముసుగులో దాగుని
క్రమంగా మతిస్థిమితం కొల్పోతూ,
సన్నగా, పాలిపోయి,తన మందిరంలోంచి
వణుకుతూ బయటకి నడిచి వస్తున్న
మృత్యుముఖంలో ఉన్న స్త్రీలా
చీకటి తూరుపు దిశను నిరాకారమైన
తెల్లని ముద్దలా చంద్రుడు ఉదయించేడు.
2
ఎందుకు నువ్వు అలా పాలిపోయావు,
అకాశాన్ని ఎక్కిన అలసటవల్లా,
భూమిపై తొంగి చూడడం వల్లా,
వేరే పుట్టుక పుట్టిన నక్షత్రాల మధ్య
తోడులేక తిరగడం వల్లా? దేని మీదా దృష్టిపెట్టలేని
సంతృప్తిలేని కళ్ళలా, ఎప్పుడూ మార్పుకి లోనవడం వల్లా?
.
షెల్లీ
(4 August 1792 – 8 July 1822)
ఇంగ్లీషు కవి.
.
- PB Shelly
Image Courtesy:
http://www.theguardian.com/books/2010/jan/28/percy-bysshe-shelley-christopher-hitchens
.
The Moon
1
And, like a dying lady lean and pale,
Who totters forth, wrapp’d in a gauzy veil,
Out of her chamber, led by the insane
And feeble wanderings of her fading brain,
The mood arose up in the murky east
A white and shapeless mass
2
Art thou pale for weariness
Of climbing heaven and gazing on the earth,
Wandering companionless
Among the stars that have a different birth,
And ever changing, like a joyless eye
That finds no object worth its constancy?
.
Percy Bysshe Shelley
(4 August 1792 – 8 July 1822)
English Poet
Poem Courtesy:
The Oxford Book of English Verse: 1250–1900
Ed. Arthur Quiller-Couch, ed. 1919
http://www.bartleby.com/101/609.html
పిల్లవాడూ- ముసలాయనా… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి
“అప్పుడప్పుడు నేను చెమ్చా జార్చెస్తుంటాను,” అన్నాడు కుర్రాడు,
“ఓస్, అంతే కదా, నేను కూడ జార్చెస్తుంటాను,” అన్నాడు ముసలాయన.
కుర్రాడు గుసగుసగా, “అప్పుడప్పుడు పక్కతడిపేస్తుంటాను,” అన్నాడు.
దానికి నవ్వుతూ, ” ఓ అదా, అప్పుడప్పుడు నేనూ చేస్తుంటాను,” అన్నాడు.
“ఎందుకో, నాకు తరచు ఏడుపొస్తుంటుంది,” అన్నాడు కుర్రాడు.
ముసలాయన తల తాటిస్తూ, “నేనూ అంతే” అన్నాడు.
ఫిర్యాదుగా “నాకు అన్నిటికంటే బాధించే విషయమేమిటంటే,
పెద్దవాళ్ళు ఎప్పుడూ నన్ను పట్టించుకోరు,” అన్నాడు కుర్రాడు.
ముడుతలపడ్డ చెయ్యి వెచ్చగా తగిలింది ఆ కుర్రాడికి.
“నీ మాటలవెనక ఉన్న బాధ నేను అర్థం చేసుకోగలను,” అన్నాడు ముదుసలి.
.
షెల్ సిల్వర్ స్టీన్
(September 25, 1930 – May 10, 1999).
అమెరికను కవీ, గేయ రచయితా, చిత్రకారుడూ, స్క్రీన్ ప్లే రచయితా, బాలసాహిత్యకారుడూ .
.
Shel Silverstein
.
The Little Boy and the Old Man
.
Said the little boy, “Sometimes I drop my spoon.”
Said the old man, “I do that too.”
The little boy whispered, “I wet my pants.”
I do that too,” laughed the little old man.
Said the little boy, “I often cry.”
The old man nodded, “So do I.”
But worst of all,” said the boy, “it seems
Grown-ups don’t pay attention to me.”
And he felt the warmth of a wrinkled old hand.
I know what you mean,” said the little old man.”
.
Shel Silverstein
(September 25, 1930 – May 10, 1999)
American poet, singer-songwriter, cartoonist, screenwriter, and author of children’s books.
వల .. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నీమీద ఎన్నో గీతాలు రాసేను,
కానీ ఏ ఒక్కటీ నిన్ను పూర్తిగా ఆవిష్కరించలేదు…
అదెలాంటి ప్రయత్నమంటే, నక్షత్రాన్ని పట్టుకుందికి
ఆకాశం మీదకి వలవేయడం లాంటిది.
నా చేతిని దొన్నెలా చేసి ఆత్రంగా
సముద్రపు నీరు పట్టడం లాంటిది,
తీరా చూడబోతే, పట్టిన నీటికి
ఆ నీటికున్న చిక్కని నీలి సొగసులు ఉండవు.
.
సారా టీజ్డేల్
(ఆగష్టు 8, 1884 – జనవరి 29, 1933)
అమెరికను కవయిత్రి
.
Sarah Teasdale
Image Courtesy: http://img.freebase.com
.
The Net
.
I made you many and many a song,
Yet never one told all you are —
It was as though a net of words
Were flung to catch a star;
It was as though I curved my hand
And dipped sea-water eagerly,
Only to find it lost the blue
Dark splendor of the sea.
.
Sarah Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American
(From ‘Flame and Shadow’ by Sarah Teasdale)
ప్రేమకి ఒక పరిభాష ఉంది… హెలెన్ సెలీనా షెరిడన్, ఇంగ్లీషు కవయిత్రి
ఏ కాలంలోనైనా ప్రేమకో పరిభాష ఉంటుంది…
అదొక నిగూఢ, పురాతన ప్రేమపూర్వక చిత్రలిపి…
ఇంతకుముందు ఎన్నడూ చెప్ప బడని…
కన్నీట రాసిన ఆ కథ ఒక్క హృదయమే చదవగలదు.
ప్రేమకి దాని కొలమానాలు దానికున్నాయి,
అప్పటివరకు ఇవ్వని చనువు పరిమితులు గుర్తించడానికి …
ప్రపంచాన్ని పరిహసించగలదాన్ని కొలవడానికి,
అది మృత్యువంత గంభీరమూ, రోదసి అంత ఉన్నతమూ.
ప్రేమకి దాని గుప్తనిధులుదానికున్నాయి
నిజమైన ప్రేమనీ, సేవనీ సమ్మానించడానికి.
పరులకి పనికిరానివైనా, అవి అమూల్యమైనవే,
సృష్టిలో ఏ వస్తువూ వాటి విలువకు సాటి రావు.
.
హెలెన్ సెలీనా షెరిడన్
(1807-1867)
ఇంగ్లీషు కవయిత్రి .
.
Helen Selina Sheridan
.
Love Hath A Language
.
Love hath a language for all years—
Fond hieroglyphs, obscure and old—
wherein the heart reads, writ in tears,
The tale which never yet was told.
Love hath his meter too, to trace
Those bounds which never yet were given,—
To measure that which mocks at space,
Is deep as death, and high as heaven.
Love has his treasure hoards, to pay
True faith, or goodly service done,—
Dear priceless nothings, which outweigh
All riches that sun shines on.
.
Helen Selina Sheridan
(1807-1867)
English Poetess
Poem Courtesy:
మన్మధుడి వేదన… థామస్ మూర్. ఐరిష్ కవి
బాల మన్మధుడు, ఒక సారి, అలసి
గులాబిశయ్యపై తన తల వాల్చేడు;
దురదృష్టవశాత్తూ, ఆ చిన్నారి
ఆకుల మధ్య నిద్రిస్తున్న తేనెటీగను గమనించలేదు.
తేనెటీగ నిద్ర లేచింది — వెర్రి కోపంతో,
లేస్తూనే కటుక్కున కుట్టింది పాపం ఆ బాలుణ్ని.
అతని ఏడుపులు పెడబొబ్బలూ హృదయవిదారకం
వాళ్ళ అమ్మదగ్గరకి పరుగు పరుగున వెళ్ళి,
“అమ్మా! అమ్మా! చూడు. ఒళ్ళు మండిపోతోంది;
బాధతో చచ్చిపోతున్నాను, నిజం. ప్రాణం పోతోంది.
చిన్న పురుగు ఏదో కోపంతో కరిచింది —
బుల్లి రెక్కలు తొడుక్కున్న పామై ఉంటుంది…
హా! గుర్తుకొచ్చింది, దాన్ని తేనెటీగ అంటారు
పూర్వం ఓ రైతు అలా పిలవడం గుర్తొచ్చింది,” అన్నాడు.
అతనలా మాటాడుతున్నంతసేపూ
తల్లి మురిపెంగా నవ్వుతూ వింది.
విని అంది గదా, “నా చిట్టి తండ్రీ, ఒక తేనెటీగ
ముట్టుకుంటేనే అంత అల్లాదిపోతున్నావు గదా,
పాపం, ఆ హృదయం ఎంత విలవిలలాడాలి, చిన్ని మారా!
నిస్సహాయంగా నీ శరాఘాతం తగిలి!” అంది.
.
థామస్ మూర్
(28 May 1779 – 25 February 1852)
ఐరిష్ కవి
.
Thomas Moore
Irish Poet
.
Cupid Stung
.
Cupid once upon a bed
Of roses laid his weary head;
Luckless urchin, not to see
Within the leaves a slumbering bee.
The bee awaked — with anger wild,
The bee awaked, and stung the child.
Loud and piteous are his cries;
To Venus quick he runs, he flies;
“Oh Mother! I am wounded through—
I die with pain — in sooth I do!
Stung by some little angry thing,
Some serpent on a tiny wing—
A bee it was — for once, I know,
I heard a rustic call it so.”
Thus he spoke, and she the while
Heard him with a soothing smile;
Then said, ” My infant, if so much
Thou feel the little wild bee’s touch,
How must the heart, ah, Cupid! be,
The hapless heart that’s stung by thee!”
.
Thomas Moore
(28 May 1779 – 25 February 1852)
Irish Poet
Poem Courtesy:
https://archive.org/stream/homebookofversea00stev#page/488/mode/1up
కోరిక … కేథరీన్ టైనన్, ఐరిష్ కవయిత్రి
నాకు ఏ శ్వేత సౌధాలూ అనుగ్రహించవద్దు
ఏ మౌక్తిక, స్వర్ణ ప్రదేశాలూ అక్కరలేదు;
నాకు ఒక నాలుగేళ్ల బిడ్దని ప్రసాదించు, చాలు,
ఆనందపు అవధులు చవిచూడడానికి.
నాకు ఏ గులాబివన్నె రెక్కలూ వద్దు
దొంతులు దొంతులు ధవళ వస్త్రాలూ వద్దు;
నాలుగు వత్సరాల బాలుడినివ్వు
అదే నాకు సర్వస్వం.
నాకు ఏ రత్నఖచిత స్వర్ణ కిరీటాలూ వద్దు
ఏ సంగీత సాధనాలూ, సాహిత్య పరికరాలూ వద్దు;
నా ఒడిలో ఒదిగిపోయే నాలుగేళ్ళ వయసుగల
లేత గోధుమరంగుజుత్తుగల బిడ్డని ఇవ్వు.
నాకు కెంపు రంగు బుగ్గలు గలిగి,
చలికాచుకుందికి నన్ను హత్తుకునే రెండు చేతుల్నివ్వు;
నాలుగేళ్ల వయసున్న ఆ సన్నిధిలో
స్వర్గం అతి చేరువగా ఉంటుంది.
ఓ ప్రభూ! నీ అంతరిక్షాలనుండి ఎలా ఇస్తావో
ఎత్తుకుందికి ఒక స్వర్గాన్ని అందివ్వు;
ఒకప్పుడు మేరీ అనుభవించిన స్వర్గం
కేవలం నాలుగేళ్ళ వయసుది.
.
కేథరీన్ టైనన్
Jan. 23, 1861 – April 2, 1931
ఐరిష్ కవయిత్రి
.
Katherine Tynan
Irish Poetess.
.
The Desire
.
Give me no mansions ivory white
nor places of pearl and gold;
Give me a child for all delight,
Just four years old.
Give me no wings of rosy shine
Nor snowy raiment, fold on fold;
Give me a little boy all mine,
Just four years old.
Give me no gold and starry crown
Nor harp, or palm branches unrolled;
Give me a nestling head of brown,
Just four years old.
Give me a cheek that’s like the peach
Two arms to clasp me from the cold;
And all my heaven’s within my reach,
Just four years old.
Dear God, You give me from Your skies,
A little paradise to hold,
As Mary once her Paradise,
Just four years old.
.
Katherine Tynan
Jan. 23, 1861 – April 2, 1931
Irish Poetess
Poem Courtesy:
https://archive.org/stream/homebookofversea00stev#page/254/mode/1up