అనువాదలహరి

అనుకోకుండా… పాట్రిక్ మెగిల్, ఐరిష్ కవి

ఈ చిన్ని కవితలు, మోటుగా వినసొంపు లేకుండా ఉంటే ఉండనీండి,

వీటిని నేను పూరిపాకలొ, సోమరిపోతు ధనికుల భవంతులచెంత

లోతైన మురికి గుంటలో, బోర్లపడిన బొక్కెన ఆదర్శంగా రాసేను. 

అదిగో ఇంజన్లు పరిగెత్తే రాదారుల్లోనో, హాయైన రాచబాట మీదనో,

దీనికి మీరు తగిన గుర్తింపు ఇవ్వకపోవచ్చు, మీ అనుమానం తీర్చడానికి,

ఈ కవితల్ని రాసింది నేనే, భగవంతుడు సాక్షిగా, ఆ విషయం నాకే తెలుసు!

వాటిని ఏ పెనం పక్కనో, లేదా ఏ వణికిస్తున్న ఆరుబయటనో రాసేను,

అందులో కొన్ని మృత్యువంత సత్యం, కొన్ని కేవలం కల్పనలు,

కొన్ని మరీ తెలివితక్కువవి, కొన్ని మాత్రం అదో రకం.

చిన్న చిన్న వేదనలూ, ఆశలూ, చిరుప్రాసలూ, విషమ ప్రాసలూ,

కొన్ని సమకాలీన సదాచారులకి అంతగా రుచించకపోవచ్చు,

కొన్ని నేరాల చిఠాలో నామీదే గురిచేసుకుని వ్రాసినవి.

ఒక అనాగరికుడి ముద్ర కలిగిన ఈ అనిపుణ కార్మికుడి పాటలు,

ఎవ్వరూ కోరని, ఈ ప్రపంచానికి ఎందుకూ పనికిరాని, వింతపాటలు,

శ్రామికుడి చేతిముద్రా, కార్మికుడి పాదముద్రా కలిగి ఉన్నవి ఇవి.

.

పాట్రిక్ మెగిల్

24 December 1889 – November 1963

ఐరిష్ కవి

.

By-the-Way

.

These be the little verses, rough and uncultured, which

I’ve written in hut and model, deep in the dirty ditch,

On the upturned hod by the palace made for the idle rich.

 

Out on the happy highway, or lines where the engines go,

Which fact you may hardly credit, still for your doubts ’tis so,

For I am the person who wrote them, and surely to God, I know!

 

Wrote them beside the hot-plate, or under the chilling skies,

Some of them true as death is, some of them merely lies,

Some of them very foolish, some of them otherwise.

 

Little sorrows and hopings, little and rugged rhymes,

Some of them maybe distasteful to the moral men of our times,

Some of them marked against me in the Book of the Many Crimes.

 

These, the Songs of a Navvy, bearing the taint of the brute,

Unasked, uncouth, unworthy out to the world I put,

Stamped with the brand of labor, the heel of a navvy’s boot.

.

Patrick MacGill

24 December 1889 – November 1963

Irish Poet, Novelist and Journalist

%d bloggers like this: