ఈ కవిత చాల సంక్లిష్టమైనది. దీన్ని అర్థం చేసుకుందికి థెర్మో డైనమిక్స్ లొని ఎంట్రపీ అన్న భావన తెలిస్తే చాలు. సూక్ష్మంగా చెప్పాలంటే, ఎక్కడ కేయాస్(అస్తవ్యస్తంగా ఉండడం, గందరగోళం)ఎక్కువ ఉంటే అక్కడ ఎంట్రపీ ఎక్కువ ఉందన్న మాట. మన రజకీయాలలో ఇప్పుడు ఎంట్రపీ అత్యున్నతంగా ఉందని చెప్పవచ్చు ఒక రకంగా. ఎంట్రపీ క్షీణించినపుడు అది( ఆ వ్యవస్థ) నశిస్తుంది. ఈ నేపథ్యంలొ, ప్రతి వస్తువూ, మనిషీ తనున్న స్థితినుండి లేని స్థితికి వెళతాయి. సృష్టి తీరే అంత. కనుక శాశ్వతత్వం అన్న భ్రమ పెట్టుకోకుండా, చెప్పదలుచుకున్నది నీ జీవితకాలంలో చెప్పి, ఈ ప్రకృతిని కేవలం ఒక ప్రేక్షకుడిగా దర్శించి, నీలాగే చూడ్డానికి ఈ క్రమాన్ని పునరావృతం చెయ్యి అని బోధిస్తున్నాడు కవి.
.
Against Entropy
.
The worm drives helically through the wood
And does not know the dust left in the bore
Once made the table integral and good;
And suddenly the crystal hits the floor.
Electrons find their paths in subtle ways,
A massless eddy in a trail of smoke;
The names of lovers, light of other days
Perhaps you will not miss them. That’s the joke.
The universe winds down. That’s how it’s made.
But memory is everything to lose;
Although some of the colors have to fade,
Do not believe you’ll get the chance to choose.
Regret, by definition, comes too late;
Say what you mean. Bear witness. Iterate.
.
John M Ford
(April 10, 1957 – September 25, 2006)
American Poet, Science Fiction & Fantasy Writer and Game Designer.