ల్యూసైల్… ఓవెన్ మెరెడిత్, ఇంగ్లీషు కవి
మనం కవిత్వం సంగీతం, కళలూ లేకుండా బ్రతకొచ్చు;
మనం హృదయమూ, అంతః కరణా లేకుండా బ్రతకొచ్చు;
స్నేహితులు లేకుండా, పుస్తకాలు లేకుండా బ్రతకొచ్చు;
కానీ ఏ నాగరీకుడూ వంటవాళ్లు (కుక్స్) లేకుండా బ్రతకలేడు.
అతను పుస్తకలు లేకున్నా బ్రతకొచ్చు… జ్ఞానానిదేముంది, వగవడం తప్ప?
ఏ ఆసలూ లేకుండ బ్రతకొచ్చు… ఆశదేముంది, మోసగించడం తప్ప?
అతను ప్రేమలేకుండాకూడా బ్రతకొచ్చు, అనురాగానిదేముంది, కోరికతో కృశించడం తప్ప?
కానీ భోజనం అవసరం లెకుండా బ్రతికే మనిషిని చూపెట్టండి?
.
.
ఓవెన్ మెరెడిత్
8 November 1831 – 24 November 1891
ఇంగ్లీషు కవీ, రాజదూత (భారతదేశంలో 1876-80 ల మధ్య వైస్రాయి)
.