అనువాదలహరి

వసంతమొక అజ్ఞాత హస్తం… ఇ. ఇ. కమ్మింగ్స్, అమెరికను కవి

బహుశా వసంతమొక అజ్ఞాత హస్తం…

(అదెక్కడనుండి అంత జాగ్రత్తగా

పొడచూపుతుందో అంతుచిక్కదు)

జనాలు తొంగి చూసే కిటికీని సవిరిస్తూ

(వాళ్ళు ఒకపక్కనుండి ఆశ్చర్యంగా చూస్తుంటే

వాళ్ళకి బాగా పరిచయమైనవీ, ఏమీ తెలియనివీ

వస్తువుల్ని జాగ్రత్తగా స్థలాలు

మారుస్తూ, ఒక పద్ధతిలో పెడుతూ )

అన్నిటినీ ఎంతో మెళకువతో పరివర్తనచేస్తూ…

వసంతం బహుశా

కిటికీలో మనకి బాగా పరిచయమైన చెయ్యిలాంటిది

(కొత్తవస్తువుల్నీ, పాతవస్తువుల్నీ

చాలా పదిలంగా

మార్పులు చేస్తూ,

మనుషులు జాగ్రత్తగా పరిశీలిస్తుంటే

ఆ పువ్వుని కోణాన్ని ఒక పిసరు అట్నించి ఇటో,

లేదా కాస్త గాలి జొరబడటానికి సందు చేస్తూనో

చకచకా కదులుతుంటుంది)

ఏదీ పగలకుండా నేర్పుగా …

.

ఇ. ఇ. కమ్మింగ్స్

October 14, 1894 – September 3, 1962

అమెరికను కవి

.

.

Spring is like a perhaps hand

.

Spring is like a perhaps hand

(Which comes carefully

out of Nowhere)arranging

a window, into which people look(while

people stare

arranging and changing placing

carefully there a strange

thing and a known thing here)and

 

changing everything carefully

 

spring is like a perhaps

Hand in a window

(carefully to

and from moving New and

Old things, while

people stare carefully

moving a perhaps

fraction of flower here placing

an inch of air there)and

 

without breaking anything.

EE Cummings

October 14, 1894 – September 3, 1962

American poet, painter, essayist, author, and playwright.

%d bloggers like this: