అనువాదలహరి

ఏకాంతము … లార్డ్ బైరన్, ఇంగ్లీషు కవి

తోవచూపట్టని కీకారణ్యాల్లో ఆనందం ఉంది;

ఒంటరి తీరాల్లో అలవిమాలిన పారవశ్యం కలుగుతుంది;

ఎవ్వరూ చొరలేని చోటకూడ సహవాసాలుంటాయి,

గంభీరమైన సముద్రంలోకూడా ఎగసిపడే అలలచప్పుళ్ళున్నట్టు;

మనిషంటే నాకు ప్రేమ తక్కువేం లేదు, ప్రకృతిని ఎక్కువ ప్రేమిస్తా నంతే!

మా ఈ భేటీల్లో  నేను నా రాబోయే జన్మల్లోనో

లేదా గతించిన జన్మల్లోనో ఈ విశ్వంలో విలీనమైన

విషయాలను నెమరువేసుకుంటూ, ఎంతగా అనుభూతిస్తానంటే

నేను మాటల్లో చెప్పలేను; అలాగని అంతా దాచుకోనూలేను.

ఓ అగాధ వినీల సాగరమా!  దొర్లుకుంటూ పో! పొర్లు!

పదివేల నౌకలు నీ మీద నడచుకుంటూపోయినా నీకేం లెక్కలేదు

మనిషి నేల మీద అద్భుతమైన సమాధులు  నిర్మించుకుంటాడు;

వాడి ఆధిపత్యం నీ తీరంతో సరి; నీ విశాల సలిల మైదానాలమీద

జరిగే వినాశమంతా నీ చలవే;  మనిషి చేసే విధ్వంశం

పోలికకి ఏపాటిదీ కాదు; వాడు తనకుతానై చేసుకున్నవి మినహాయిస్తే.

అపుడు, వాన చినుకులా, ఒక్క క్షణంలో,  అంతుదొరకని

నీ లోతుల్లోకి మూలుగుతూ, ఊపిరాడక మునిగిపోతాడు,

సమాధి గాని, శవపేటిక గాని, విషాద ఘంటికలు గాని లేక,  అనామకుడిగా.

.

(From Childe Harold’s Pilgrimage)

లార్డ్ బైరన్

22 జనవరి 1788 – 19 ఏప్రిల్ 1824)

ఇంగ్లీషు కవి

.

.

Solitude

 

There is a pleasure in the pathless woods; 

There is a rapture on the lonely shore;      

There is society where none intrudes,        

By the deep sea, and music in its roar:       

I love not man the less, but nature more,          

From these our interviews, in which I steal           

From all I may be, or have been before,    

To mingle with the universe, and feel         

What I can ne’er express, yet cannot all conceal.  

Roll on, thou deep and dark-blue ocean, roll!              

Ten thousand fleets sweep over thee in vain:        

Man marks the earth with ruin: his control          

Stops with the shore: upon the watery plain         

The wrecks are all thy deed, nor doth remain       

A shadow of man’s ravage, save his own,         

When, for a moment, like a drop of rain,  

He sinks into thy depths with bubbling groan,      

Without a grave, unknelled, uncoffined, and unknown.

.

(From Childe Harold’s Pilgrimage)

 

Lord Byron

(22 January 1788 – 19 April 1824)

English Poet

Poem Courtesy:

Parnassus: An Anthology of Poetry.  1880.

Compiled by: Ralph Waldo Emerson (1803–1882).

(http://www.bartleby.com/371/37.html

 

 

 

%d bloggers like this: