అనువాదలహరి

నిమిత్త సుఖం … కెన్నెత్ బర్క్, అమెరికను

నేలంతా పచ్చగా ఉంది

వార్తలు కట్టేసేనేమో

ఈ క్షణంలో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను.

ఒక చేతిలో పుస్తకం

మరో చేతిలో పానీయం

ఇంతకంటే ఏం కావాలి

కీర్తీ

మెరుగైన ఆరోగ్యమూ

ఓ పది మిలియను డాలర్లూ తప్ప?

.

కెన్నెత్ బర్క్

(May 5, 1897 – November 19, 1993)

అమెరికను సాహిత్యవేత్త

.

ఈ కవితలోని మాధుర్యమంతా నగరజీవితానికి అలవాటుపడిన మనల్ని సున్నితంగా వెక్కిరించడంలో ఉంది. మనం ప్రకృతి ఆరాధకులమనీ, శేషజీవితాన్ని ఏ మారుమూలపల్లెలోనో ఈ నగరంలోని కాలుష్యానికీ, వాహనాలరొదకీ, దూరంగా గడిపితే బాగుంటుందని ఎన్నోసార్లు అనుకుని ఉంటాము కూడా. కానీ, నిజంగా అలాంటి జీవితమే గడపవలసి వస్తే, మనకి నగరంలోని అన్ని సౌఖ్యాలూ అందుబాటులో ఉండాలి. Cellphone, TV, దగ్గరలోనే బజారు,  కావలసినపుడు డబ్బులు తీసుకుందికి ATM ఇలా.  నగర జీవితం మనసులో నాటుకుపోయిన మనం ఎంత కష్టపడ్డా పల్లెజీవిత సౌందర్యాన్ని అర్థంచేసుకోనూ లేం, ఆశ్వాదించనూ లేం.

మనకి పల్లెరూపంలో కనపడే పట్టణమే కావాలి.

Kenneth Burke

American Literary Theorist

 

.

Temporary Well Being

.

The pond is plenteous

The land is lush,

And having turned off the news

I am for the moment mellow.

With my book in one hand

And my drink in the other

What more could I want

But fame,

Better health,

And ten million dollars? .

.

Kenneth Burke

(May 5, 1897 – November 19, 1993)

American

The beauty of the poem lies in its subtle dig at our urban mind-set that romanticizes the rural life. We often claim ourselves to be Nature Lovers and yearn to spend our time peacefully in some countryside. But, when it actually comes to living such life, we need all comforts available in the town at handy distance. In a sense, we cannot find peace until we have urbanized the country side.

With an out-and-out urban psyche, we can neither understand nor truly enjoy the rural landscape in all its pristine splendour. What we really crave for is … an urbanized-village.

 

%d bloggers like this: