జన్మాంతర వాసనలు… విలియం స్టాఫోర్డ్ , అమెరికను కవి ఒక్కోసారి విశాలమైన ఆకాశంలోకి పక్షులు వీడిన జాడ ననుసరిస్తూనో, లేక కేవలం ఊరికేనో నిరీక్షిస్తూ నిలబడతావు. ఏదో లీలగా అనిపిస్తుంది ఇంతకుముందెప్పుడో ఇలాగే జరిగినట్టు; అక్కడ ఏదో ప్రశాంతత, పిల్లగాలి వీస్తుంటుంది; ఎక్కడో సెలయేటి తీరాన్నో, నది ఒడ్డునో; నీరుబిల్లిలా ఒక్క సారి జాగరూకుడవవుతావు; నువ్వు ఇప్పుడు చూసిన ఈ విశాల నిరామయ లోకంలాటివే, వేరు లోకాల్లో మరొకసారి వేగుచుక్కలా ఉదయిస్తావు, ఒక క్షణ కాలంపాటు, ఈ నిర్నిబంధ ప్రకృతి ఒడిలో. 2 అడవుల్లో ఏదో గుసగుస వినిపిస్తుంది. నీడల బారులు దారితీస్తుంటాయి; ఒక కొమ్మ చెయ్యి ఊపుతుంది; సూర్యుడి కాంతిపుంజమొకటి ఇంతదూరమూ ప్రయాణిస్తుంది; క్షణకాలంఆగిన ఒక ఆకారం ఏదో చెప్పబోయి, విరమించుకుని వెనక్కి మరలుతుంది; దారిలో ఒక గుబురు పొదని కెలుకుతూ పోతుంది. శతాబ్దాలు అలల్లా గడిచిపోవడం; తరాల దేశదిమ్మరితనం, కొత్త ప్రదేశాలు కనుక్కోడం దారితప్పి, మళ్ళీ త్రోవ తెలుసుకోవడం; తినడం, మరణించడం, మళ్ళీ పుట్టడం, అడవిలోంచి నడుస్తుంటే నీ వంటిమీది బొచ్చునెవరో నిమరడం ఇప్పుడు నీకా బొచ్చు లేకపోయినా …. అనుభవమౌతుంటుంది; అడవిలోని ఒక చీలిన బాటని జాగ్రత్తగా గమనిస్తావు; నల్లని నీ కళ్ళ చిత్రమైన, దీర్ఘమూ నిశితమూ ఐన చూపులో నీ ఇంటికోసం వెదుకులాట కనిపిస్తుంది. కొన్ని మధురమైన క్షణాలపాటు, నీ మీసాలు నీ మనసుకంటే వీశాలంగా అన్నిటినీ అధిగమిస్తూ కనిపిస్తాయి. . విలియం స్టాఫోర్డ్ January 17, 1914 – August 28, 1993 అమెరికను కవి . Atavism 1 Sometimes in the open you look up where birds go by, or just nothing, and wait. A dim feeling comes you were like this once, there was air, and quiet; it was by a lake, or maybe a river you were alert as an otter and were suddenly born like the evening star into wide still worlds like this one you have found again, for a moment, in the open. 2 Something is being told in the woods: aisles of shadow lead away; a branch waves; a pencil of sunlight slowly travels its path. A withheld presence almost speaks, but then retreats, rustles a patch of brush. You can feel the centuries ripple generations of wandering, discovering, being lost and found, eating, dying, being born. A walk through the forest strokes your fur, the fur you no longer have. And your gaze down a forest aisle is a strange, long plunge, dark eyes looking for home. For delicious minutes you can feel your whiskers wider than your mind, away out over everything. . William Stafford January 17, 1914 – August 28, 1993 American Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిఏప్రిల్ 22, 2014