కవితా చాతురి … ఆర్చిబాల్డ్ మేక్ లీష్, అమెరికను కవి ఒక గుండ్రని పండులా, కవిత స్పర్శకి తెలిసి మౌనంగా ఉండాలి ఎప్పటివో పాతపతకాలు బొటనవేలితో మాటాడినట్టు మూగగా మాటాడాలి నాచుపట్టిన కిటికీపక్క నాపరాయిపలకలు భుజాలరాపిడికి అరిగినట్టు చప్పుడుచెయ్యకుండా అరిగిపోవాలి ఎగురుతున్న పక్షుల్లా కవిత భాషాతీతంగా ఉండాలి నెమ్మదిగా నింగినెక్కుతున్న చంద్రుడిలా కాలానికి తెలియకుండా అది కదలాలి చీకటికి చిక్కుపడ్డ చెట్లు విస్తరిస్తున్న వెన్నెలలో ఒకటొకటిగా కొమ్మలు కనిపించినట్టు, అర్థమవాలి శీతకాలపు చెట్ల ఆకుల వెనక కదిలే చంద్రుడిలా ఒక్కొక్క జ్ఞాపకపు పొరా విడిచిపెట్టాలి నెమ్మదిగా నింగినెక్కుతున్న చంద్రుడిలా కాలానికి తెలియకుండా అది కదలాలి కవిత సత్యంతో సమానమవాలి తప్ప సత్యమే కాకూడదు. ఎందుకంటే దుఃఖ చరిత్ర అంతా ఖాళీ ద్వారాలూ, ప్రేమ ప్రతీకలే ప్రేమకోసమే అయితే ఒదుగుతున్న గడ్డిపోచలూ, సముద్రానికావల రెండు దీపాల్లా ఉండాలి కవిత ఊహించుకో కూడదు దానికి అస్తిత్వం ఉండాలి. . ఆర్చిబాల్డ్ మేక్ లీష్ May 7, 1892 – April 20, 1982 అమెరికను కవి . Archibald MacLeish . Ars Poetica (Art of Poetry) . A poem should be palpable and mute As a globed fruit Dumb As old medallions to the thumb Silent as the sleeve-worn stone Of casement ledges where the moss has grown – A poem should be wordless As the flight of birds A poem should be motionless in time As the moon climbs Leaving, as the moon releases Twig by twig the night-entangled trees, Leaving, as the moon behind the winter leaves, Memory by memory the mind – A poem should be motionless in time As the moon climbs A poem should be equal to: Not true For all the history of grief An empty doorway and a maple leaf For love The leaning grasses and two lights above the sea – A poem should not mean But be . Archibald MacLeish May 7, 1892 – April 20, 1982 American Poet Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 1 వ్యాఖ్యఏప్రిల్ 21, 2014