యాభై ఏమిటి చెబుతోంది… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి
నేను చిన్నగా ఉన్నప్పుడు నా అధ్యాపకులందరూ ముసలివాళ్ళు
నా ఉత్సాహం నీరుకారిపోయేదాకా అర్థాన్ని వదిలి పదాలకోసం ప్రాకులాడేను,
కరిగించిన లోహంలా ఎలా పోతపోస్తే అలా తయారయ్యాను.
నేను బడికి వెళ్ళి వయోజనుడనై అంతా గతంగురించి నేర్చుకున్నాను
ఇప్పుడు నేను ముసలివాడిని, కానీ, నా గురువులు పిల్లలు.
ఒక మూసలోపొయ్యడానికి ఒదగనివి స్వయంగా ఫలించి, ఎదుగుతాయి;
ఎలా అతుకులువెయ్యాలా అని నేను పాఠాలతో సతమతమౌతున్నాను
ఇప్పుడు బడికి వెళుతున్నది పిల్లలనుండి భవిష్యత్తు నేర్చుకుందికి.
.
రాబర్ట్ ఫ్రాస్ట్
(March 26, 1874 – January 29, 1963
అమెరికను కవి
.
