బలహీనమైనది… ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవయిత్రి అన్నిటిలోకీ బలహీనమైనదేదో నా మనసు ఊహించగలదా? సూర్యుడు… ఒక చిన్న మబ్బుతునక చాలు మాటుచేసి కనుచూపుమేర చీకటి ఆవరింపజెయ్యడానికి. కానీ, అదే మేఘం ఎక్కడున్నా చిన్నగాలి చాలదూ, చెల్లాచెదరు చెయ్యడానికి? కానీ, ఆ గాలినే మీది కొమ్మల్లో ఎండిపోయిన చిన్న ఆకు నిలదొక్కుకోదూ? ఆ పండుటాకు ఎన్నాళ్ళు పచ్చగా ఉందో అన్నాళ్ళు నా జీవితం హాయిగా గడిచింది. ఇప్పుడు, వసంతానికి ఏ అర్థం ఇచ్చినా, నేను విచారించకుండా ఉండలేను. ఓహ్, భగవాన్! కేవలం నిట్టూర్పులకే పెదాలు రెండుగా చీలే చిగురాకుని నేను! అలాగైతే, నా మనసేనా అన్నిటిలోకీ నేనూహించగల బలహీనమైన వస్తువు? కానీ, సూర్యుడూ, మేఘమూ రెండూ శుష్కించి కనుమరుగైనా, ఒక్క దెబ్బకి, అది వడిగాలి కానక్కరలేదు, అడవులన్నీ వాలి మోడులైపోయినా, శాపగ్రస్తమైన అనంతమైన చీకటిలోంచికూడా మనిషిని అపూర్వమైన కీర్తిప్రతిష్ఠలవైపు తీసికెళ్ళగలిగేదీ, ఈ సృష్టిలో అన్నిటికన్నా శక్తివంతమై బలహీనుల్ని కాపాడి పరిరక్షించేదీ, మనసే! . ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ 6 March 1806 – 29 June 1861 ఇంగ్లీషు కవయిత్రి . Elizabeth Barrett Browning 6 March 1806 – 29 June 1861 . Weakest of All . Which is the weakest thing of all Mine heart can ponder? The sun, a little cloud can pall With darkness yonder? The cloud, a little wind can move Where’er it listeth? The wind, a little leaf above, Though sere, resisteth? What time that yellow leaf was green, My days were gladder; But now, whatever Spring may mean, I must grow sadder. Ah me! a leaf with sighs can wring My lips asunder – Then is mine heart the weakest thing Itself can ponder. Yet, Heart, when sun and cloud are pined And drop together, And at a blast, which is not wind, The forests wither, Thou, from the darkening deathly curse To glory breakest, – The Strongest of the universe Guarding the weakest! . Elizabeth Barrett Browning 6 March 1806 – 29 June 1861 English Poetess. Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిఏప్రిల్ 18, 2014