తుఫాను తునక… మార్క్ స్ట్రాండ్, కెనేడియన్ అమెరికన్ కవి.
(షరోన్ హోర్వత్ కి)
ఆకాశహర్మ్యాల నగరంలో వాటి నీడలను తప్పించుకుని
ఎలాగో ఒక దూదిపింజలాంటి మంచు తునక, తుఫాను తునక, నీ గదిలోకి దూరింది.
దూరి, పుస్తకంచదువుకుంటున్న నువ్వు, తలెత్తి
కుర్చీ వైపు చూసిన క్షణంలోనే దాని చేతిమీద వాలింది. అంతే!
అంతకు మించి ఏమీ లేదు. గుర్తింపుకీ నిర్లక్ష్యానికీ గురవుతూ,
తృటిలో ప్రశాంతంగా శూన్యంలోకి కరిగిపోవడం మినహా…
రెండు కాలాల సంధి కాలం, పూలు నోచని మరణం.
అంతే! అంతకు మించి మరేమీ లేదు,
ఈ తుఫాను తునక నీ కళ్ళముందే శూన్యంగా మారిందన్న
విషయం మినహాయిస్తే. అది మళ్ళీ తిరిగొస్తుంది,
కొన్ని సంవత్సరాల తర్వాత, నువ్వు ఇప్పుడు కూర్చున్నట్టే కూచుని ఎవరో అంటారు:
“వేళయింది. గాలి వీస్తోంది. ఏ క్షణంలో నైనా ఇక తుఫాను కురియొచ్చు.”
.
.
మార్క్ స్ట్రాండ్
April 11, 1934
కెనేడియన్ అమెరికన్ కవి.