అనువాదలహరి

శక్తి మేరకి … ఏ డీ హోప్, ఆస్ట్రేలియన్ కవి.

గేలానికి చిక్కిన చేప చనిపోతూ చనిపోతూ,

ఊపిరికోసం అవస్థపడుతూ, భయంతో బాధతో గిలగిలలాడుతూ

తెరుచుకున్న నోరు ఎండిపోతుంటే, దాని బేల కళ్ళలో ధైర్యం సడలకుండా

తన కొలను గురించే ఆలోచిస్తుంది తన శక్తి మేరకు.

మోసగించబడి, అంధుడైన కవి, తనశక్తి మేరకి

మిల్లు చప్పుళ్ళు ఏకాగ్రతకి భంగం కలిగించినా,

బానిసల తోపులాటలూ, ప్రేలాపనలూ, అమ్మకాల ఎకసెక్కాల మధ్య

సంగీతపు మూలాలను దొరకబుచ్చుకుంటాడు.

నాకు చాతనయినంత, నిరాశావహమైన ఈ మనః స్థితిలో

నువ్వు వెళ్ళినప్పటినుండీ శూన్యంగా, వృధాగా గడిచిన రాత్రుళూ, పవళ్ళూ,

నీ చిరునవ్వూ, నీ హేల, కదలికలూ, నీ అనురాగం గుర్తుచేసుకుంటున్నాను.

వాటి లక్షణమే అంత! 

.

ఏ డీ  హోప్ 

21 July 1907 –13 July 2000

ఆస్ట్రేలియన్ కవి.

(Important Note:

“మోసగించబడి, అంధుడైన కవి, తనశక్తి మేరకి

మిల్లు చప్పుళ్ళు ఏకాగ్రతకి భంగం కలిగించినా,”….

అన్నచోట బైబిలులోని Samson  పాత్రని పరోక్షంగా గుర్తుచేస్తున్నాడు. )

 

.

As Well as They Can

.

As well as it can, the hooked fish while it dies,

Gasping for life, threshing in terror and pain,

Its torn mouth parched, grit in its delicate eyes,

Thinks of its pool again.

As well as he can, the poet, blind, betrayed

Distracted by the groaning mill, among

The jostle of slaves, the clatter, the lash of trade,

Taps the pure source of song.

As well as I can, my heart in this bleak air,

The empty days, the waste nights since you went,

Recalls your warmth, your smile, the grace and stir

That were its element.

[Published in New Poems 1965-69 (Sydney: Angus & Robertson, 1969), p. 52.]

.

A D Hope

21 July 1907 –13 July 2000

Australian poet and essayist

(Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2005/02/as-well-as-they-can-d-hope.html)

 

 

%d bloggers like this: