ఓ రాత్రి ఆరుబయట… దూ ఫూ, చీనీ కవి
తీరాన దట్టంగా పెరిగిన గడ్డిలో పిల్లగాలి అలలు రేపుతోంది,
రాత్రల్లా, చలనంలేని ఈ వాడ కొయ్యమీదకి
అవధిలేని రోదసిలోంచి చుక్కలు వాలసాగేయి.
చందమామ నీటికెదురీదుతూ పైకి రా సాగేడు.
నా కళ నాకు పేరుతెచ్చి, ఈ ముదిమి వయసులో
ఉద్యోగావసరం నుండి తప్పించగలిగితేనా! …
నిలకడలేని ఈ పరుగేమిటి నాకు…
ఈ సువిశాలమైన జగతిలో గూడులేక అల్లల్లాడే పక్షిలా.
.
దూ ఫూ
(712 – 770 AD)
చీనీ కవి
.