మరబొమ్మ… డాలియా రవికోవిచ్, ఇజ్రేలీ కవయిత్రి
ఆ రాత్రి నేను మర బొమ్మనే
అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాను,
నేను పడిపోయి ముక్కముక్కలైపోయాను
నా రూపం, నేర్పూలూ వాళ్ళు అతికి పునరుద్ధరించేరు.
మళ్ళీ నేను పూర్వపు బొమ్మలా తయారయ్యేను,
నా నడవడి ఎప్పటిలాగే అణకువగానే ఉంది;
అయినప్పటికీ, నేను కొత్తబొమ్మనే
విరిగిన కొమ్మని నులితీవలు దగ్గరా చుట్టి ఉంచినట్టు.
నాన్ను మళ్ళీ నాట్యం చెయ్యమన్నప్పుడు
నా అడుగులు లయబద్ధంగా పడుతున్నప్పటికీ
నాకు జంటగా ఇచ్చినది పిల్లినీ, కుక్కనీ.
నా జుత్తు పసిడి రంగు, కళ్ళు నీలి రంగు,
నా దుస్తులమీద పూలు విరబూస్తునాయి
నా ఈతాకుటోపీ మీద వాకపళ్ళు మెరుస్తున్నాయి.
.
డాలియా రవికోవిచ్
ఇజ్రేలీ కవయిత్రి