అనువాదలహరి

మూడురోజులు … జేమ్స్ రాబర్ట్స్ గిల్మోర్, అమెరికను కవి

చెయ్యవలసినదనంతం; చేసింది స్వల్పం!

 నిన్న రాత్రి సూర్యుణ్ని చూశాను

ఏ వెలుగులూ లేకుండా చీకటిగుహలోకి క్రుంగిపోతూ…

నిన్న…ఆహ్! ఒక భయంకరమైన ప్రేతం.  

చెయ్యవలసినదనంతం; చేసింది స్వల్పం!

ప్రతిరోజూ ఏదో ఒక కొత్త సంఘర్షణతో తెల్లారుతుంది;

అయినా సరే, ధైర్యంగా, ఉత్సాహంతో, రంగంలోకి దిగుతాను,

ఈ రోజు… యుద్ధంలో పాలుపంచుకుంటాను.

చెయ్యవలసినదనంతం; చేసింది స్వల్పం!

కానీ అంతా అయిపోయేక, గెలుపు సాధించినట్టే.

ఓహ్! నా మనసా! ఈ కష్టాలూ, ఈ దుఃఖమూ

రేపు… తో … హాయిగా అన్నీ సమసిపోతాయి.

.

జేమ్స్ రాబర్ట్స్ గిల్మోర్

(1822–1903)

అమెరికను కవి

.

Three Days

.

SO much to do: so little done!        

Ah! Yesternight I saw the sun        

Sink beamless down the vaulted gray,—

The ghastly ghost of YESTERDAY.       

So little done: so much to do!      

Each morning breaks on conflicts new;  

But eager, brave, I’ll join the fray,

And fight the battle of TO-DAY. 

  

So much to do: so little done!

But when it’s o’er,—the victory won,—         

Oh! then, my soul, this strife and sorrow

Will end in that great, glad TO-MORROW.

 

.

James Roberts Gilmore

(1822–1903)

American Poet

Poem Courtesy: http://www.bartleby.com/360/6/59.html

World’s Best Poetry, Volume VI, Fancy. 1904. Ed. Bliss Carman et al.

 

%d bloggers like this: