నిజమైన ఎరుక … ఆస్కార్ వైల్డ్, ఐరిష్ కవి
నీకన్నీ తెలుసు; నేను వృధాగా
ఆశిస్తున్నాను ఏ పొలం దున్నాలా, ఏ విత్తు నాటాలా అని…
నేలంతా ముళ్ళకంపలతో, కలుపుతో నల్లబారింది
ఇక వానకురిసినా, కన్నీరు కురిసినా దానికి ఒకటే.
నీకన్నీ తెలుసు; నేను అలా ఊరికే కూచుని నిరీక్షిస్తాను
చేవతప్పిన చేతులతో, చూడలేని కళ్లతో,
కడపటి ముసుగు తొలగించేదాకా,
తొలిసారి ద్వారాలు తెరుచుకునేదాకా
నీ కన్నీ తెలుసు; నాకు చూపులేదు.
నా జీవితం వృధా పోదని నాకు నమ్మకం
ఏ శాశ్వత దివ్యలోకాలలోనో
మనం తప్పక మళ్ళీ కలుస్తామని నాకు తెలుసు.
.
(గ్రీకునుండి అనువాదం)
.
ఆస్కార్ వైల్డ్
(16 October 1854 – 30 November 1900)
ఐరిష్ కవి, కథకుడూ, నవలాకారుడూ.
.
