వర్షాగమనం… థామస్ బెయిలీ ఏల్డ్రిచ్, అమెరికను కవి
వర్షం పడుతుందని మాకు తెలుసు, ఎందుకంటే పొద్దుటినుంచీ,
సన్నని మంచుబిందుల తాళ్ళపై ఊగుతూ
వర్షాధిదేవత తన బంగారు నీటి బొక్కెనలను దించుతోంది
ఎండి, శుష్కించి, ధూళి ఎగజిమ్మే పగుళ్ళుబారిన
పర్రలుగా మారిన చవిటి, బాడవ పొలాలమీదకి.
పువ్వులలో దాగున్న తుహినబిందువులని పైకివిరజిమ్ముతూ
సముద్రంలోంచి మణుల్ని వెలికితీసి
నేలమీద రత్నాల రాశులుగా విరజిమ్మడానికి.
మాకు తెలుసు వర్షం వొస్తుందని, ఎందుకంటే,
చెట్లు వాటి ఆకుల అడుగుభాగాల్ని చూపిస్తున్నాయి,
పలకబారి జేగురులోకిమారిన పండ్లు గాలికి దాక్కున్నాయి,
మెరుపులిపుడు చంచలమైన వర్షధారల కండెలలో చిక్కుకున్నాయి.
.
థామస్ బెయిలీ ఏల్డ్రిచ్
(November 11, 1836 – March 19, 1907)
అమెరికను కవి
.

.
Before the Rain
.
We knew it would rain, for all the morn,
A spirit on slender ropes of mist
Was lowering its golden buckets down
Into the vapory amethyst
Of marshes and swamps and dismal fens —
Scooping the dew that lay in the flowers,
Dipping the jewels out of the sea,
To sprinkle them over the land in showers
We knew it would rain, for the poplars showed
The white of their leaves, the amber grain
Shrunk in the wind—and the lightning now
Is tangled in tremulous skeins of rain!
.
Thomas Bailey Aldrich.
(November 11, 1836 – March 19, 1907)
American poet, novelist, travel writer and editor.
Poem Courtesy:
Golden Numbers: A Book of Verse for Youth (A Project Gutenberg Book)
Editor: Kate Douglas Wiggin & Nora Archibald Smith
http://www.gutenberg.org/files/34237/34237-h/34237-h.htm#Page_45