అనువాదలహరి

Edna St. Vincent Millay

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

అతని దగ్గర ఏవి ఉండేవో, ఏవి కోల్పోయేడో ఇక్కడ ఒక చిట్టా రాసేడు.

ఆ తర్వాత అతనికి రావలసిన బకాయిలు ఒక చిట్టా,

దాని వెనక అతనిదగ్గర ఇప్పుడు ఏమి ఉన్నాయో, ఇంకా ఏమి కావాలో;

ఆ లెక్కలన్నీ పూర్తయేక అతని తాహతుకి ఏవి ఉండాలో వ్రాసి

మిగతావాటితో జత చేశాడు.

తర్వాత అతనికి హక్కుగా రావలసినవీ,

అతను సాధించలేకపోయినవీ,

అతన్ని మోసగించి తీసుకోబడినవీ,

చివరగా, అతనిదగ్గర దొంగిలించబడినవీ చిట్టాలు తయారయ్యేయి.

ఈ లెక్కలు వెయ్యడానికి అతనికి సంవత్సరాలు పట్టింది.

తొలిరోజుల్లో అతనికి చాలా విద్యలు వచ్చు, అతని జీవితం ఏ త్రోవలోనైనా వెళ్లి ఉండేది.

ఇప్పుడు అతని ఏకాగ్రత అంతా …

అతనికున్నవి, పక్కవాళ్లకున్నవి, అతనికి ఇంకా ఏమిటి ఉండాలి…

ఈ లెక్కలతోనే సరిపోతోంది… అన్నీ పేరాశలూ, గొంతెమ్మ కోరికలూ.

ఇప్పుడవన్నీ మరో పెద్ద చిట్టా అయేయి.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

February 22, 1892 – October 19, 1950

అమెరికను కవయిత్రి.

For the Original please visit:

http://www.poetryfoundation.org/poetrymagazine/browse/12/3#!/20605507

%d bloggers like this: