రోజు: ఏప్రిల్ 2, 2014
-
నా పేరు … మార్క్ స్ట్రాండ్, కెనేడియన్ అమెరికను కవి.
ఒకనాటి రాత్రి, పచ్చికబయలంతా స్వర్ణహరితమై ఉన్నపుడు సుగంధం నిండిన వాతావరణంలో, చంద్రకాంతశిలలతోచేసిన నిలువెత్తు కొత్త సమాధుల్లా వెన్నెల్లో చెట్లు కనిపిస్తున్నపుడు, నైసర్గిక ప్రకృతి అంతా కీటకాల అరుపులతో ప్రతిధ్వనిస్తున్నపుడు, నేను గడ్డిలో మేనువాల్చి, పైన పరుచుకున్న అనంతదూరాలను తలుచుకుంటూ చివరకి నేనేమౌతాను… నన్ను నేనెక్కడ కనుక్కోగలనని ప్రశ్నించుకున్నాను… నా ఉనికి నేను మరిచినప్పటికీ, ఒక క్షణంపాటు, నక్షత్రాలుపొదిగిన సువిశాల ఆకాశం నాదేననిపించింది, తొలిసారి వర్షాన్నీ, గాలిహోరునీ వింటున్నట్టు, మొదటిసారిగా నా పేరు నేను వింటున్నట్టు అది నా […]