అనువాదలహరి

అనుకోకుండా… పాట్రిక్ మెగిల్, ఐరిష్ కవి

ఈ చిన్ని కవితలు, మోటుగా వినసొంపు లేకుండా ఉంటే ఉండనీండి,

వీటిని నేను పూరిపాకలొ, సోమరిపోతు ధనికుల భవంతులచెంత

లోతైన మురికి గుంటలో, బోర్లపడిన బొక్కెన ఆదర్శంగా రాసేను. 

అదిగో ఇంజన్లు పరిగెత్తే రాదారుల్లోనో, హాయైన రాచబాట మీదనో,

దీనికి మీరు తగిన గుర్తింపు ఇవ్వకపోవచ్చు, మీ అనుమానం తీర్చడానికి,

ఈ కవితల్ని రాసింది నేనే, భగవంతుడు సాక్షిగా, ఆ విషయం నాకే తెలుసు!

వాటిని ఏ పెనం పక్కనో, లేదా ఏ వణికిస్తున్న ఆరుబయటనో రాసేను,

అందులో కొన్ని మృత్యువంత సత్యం, కొన్ని కేవలం కల్పనలు,

కొన్ని మరీ తెలివితక్కువవి, కొన్ని మాత్రం అదో రకం.

చిన్న చిన్న వేదనలూ, ఆశలూ, చిరుప్రాసలూ, విషమ ప్రాసలూ,

కొన్ని సమకాలీన సదాచారులకి అంతగా రుచించకపోవచ్చు,

కొన్ని నేరాల చిఠాలో నామీదే గురిచేసుకుని వ్రాసినవి.

ఒక అనాగరికుడి ముద్ర కలిగిన ఈ అనిపుణ కార్మికుడి పాటలు,

ఎవ్వరూ కోరని, ఈ ప్రపంచానికి ఎందుకూ పనికిరాని, వింతపాటలు,

శ్రామికుడి చేతిముద్రా, కార్మికుడి పాదముద్రా కలిగి ఉన్నవి ఇవి.

.

పాట్రిక్ మెగిల్

24 December 1889 – November 1963

ఐరిష్ కవి

.

By-the-Way

.

These be the little verses, rough and uncultured, which

I’ve written in hut and model, deep in the dirty ditch,

On the upturned hod by the palace made for the idle rich.

 

Out on the happy highway, or lines where the engines go,

Which fact you may hardly credit, still for your doubts ’tis so,

For I am the person who wrote them, and surely to God, I know!

 

Wrote them beside the hot-plate, or under the chilling skies,

Some of them true as death is, some of them merely lies,

Some of them very foolish, some of them otherwise.

 

Little sorrows and hopings, little and rugged rhymes,

Some of them maybe distasteful to the moral men of our times,

Some of them marked against me in the Book of the Many Crimes.

 

These, the Songs of a Navvy, bearing the taint of the brute,

Unasked, uncouth, unworthy out to the world I put,

Stamped with the brand of labor, the heel of a navvy’s boot.

.

Patrick MacGill

24 December 1889 – November 1963

Irish Poet, Novelist and Journalist

శాశ్వతత్వానికి వ్యతిరేకంగా .. జాన్ ఎం. ఫోర్డ్, అమెరికను

క్రిమి సర్పిలాకారంగా బల్లని దొలుచుకుంటూ పోతుంది

తాను చేసిన కన్నంలో  ఉండే ఆ కర్ర పొడే, కప్పుడు

ఆ బల్లని దృఢంగా, ఏకాండిగా ఉంచేదని దానికి తెలీదు;

అకస్మాత్తుగా ఒక స్ఫటికం నేలమీదపడి పగులుతుంది;

ఎలక్ట్రాన్లు వాటిత్రోవని చాలా నేర్పుగా తెలుసుకుంటాయి,

ద్రవ్యరహిత ప్రవాహం పొగవ్యాపించిన జాడలననుసరిస్తుంది;

ఒకప్పుడు అందరినాలికలమీద ఆడిన ప్రేమికుల పేర్లు

తెలియకపోయినా నీకు ఇపుడు పెద్దనష్టం లేదు; అదే చిత్రమంటే.

ఈ సృష్టి క్రమంగా నశిస్తుంది. అది అలాగే సృష్టించబడ్డది.

కాని జ్ఞపకశక్తి కోల్పోవడం సర్వం కొల్పోవడమే.

అయితే అందులో క్రమంగా కొన్ని రంగులు ఏదోనాడు వెలిసిపోవలసినవైనా

ఏది వెలిసిపోనివ్వాలో ఎంచుకునే అవకాశం నీకుంటుందని భ్రమపడకు

పశ్చాత్తాపపడడం ఎప్పుడూ ఆలస్యంగానే కలుగుతుంది; దాని నిర్వచనమే అంత;

చెప్పదలుచుకున్నదేదో చెప్పెయ్; సాక్షిగా చూస్తుండు; తరాలు పునరావృతం చెయ్యి. 

.

జాన్ ఎం. ఫోర్డ్

ఏప్రిల్ 10, 1957 – సెప్టెంబరు 25, 2006

అమెరికను

 ఈ కవిత చాల సంక్లిష్టమైనది. దీన్ని అర్థం చేసుకుందికి థెర్మో డైనమిక్స్ లొని ఎంట్రపీ అన్న భావన తెలిస్తే చాలు. సూక్ష్మంగా చెప్పాలంటే, ఎక్కడ కేయాస్(అస్తవ్యస్తంగా ఉండడం, గందరగోళం)ఎక్కువ ఉంటే అక్కడ ఎంట్రపీ ఎక్కువ ఉందన్న మాట. మన రజకీయాలలో ఇప్పుడు ఎంట్రపీ అత్యున్నతంగా ఉందని చెప్పవచ్చు ఒక రకంగా.  ఎంట్రపీ క్షీణించినపుడు అది( ఆ వ్యవస్థ) నశిస్తుంది. ఈ నేపథ్యంలొ, ప్రతి వస్తువూ, మనిషీ తనున్న స్థితినుండి లేని స్థితికి వెళతాయి. సృష్టి తీరే అంత. కనుక శాశ్వతత్వం అన్న భ్రమ పెట్టుకోకుండా, చెప్పదలుచుకున్నది నీ జీవితకాలంలో చెప్పి, ఈ ప్రకృతిని కేవలం ఒక ప్రేక్షకుడిగా దర్శించి, నీలాగే చూడ్డానికి ఈ క్రమాన్ని పునరావృతం చెయ్యి అని బోధిస్తున్నాడు కవి.

.

Against Entropy

.

The worm drives helically through the wood

And does not know the dust left in the bore

Once made the table integral and good;

And suddenly the crystal hits the floor.

Electrons find their paths in subtle ways,

A massless eddy in a trail of smoke;

The names of lovers, light of other days

Perhaps you will not miss them. That’s the joke.

The universe winds down. That’s how it’s made.

But memory is everything to lose;

Although some of the colors have to fade,

Do not believe you’ll get the chance to choose.

Regret, by definition, comes too late;

Say what you mean. Bear witness. Iterate.

 .

John M Ford

(April 10, 1957 – September 25, 2006)

American Poet, Science Fiction & Fantasy Writer and  Game Designer.

ల్యూసైల్… ఓవెన్ మెరెడిత్, ఇంగ్లీషు కవి

మనం కవిత్వం సంగీతం, కళలూ లేకుండా బ్రతకొచ్చు;

మనం హృదయమూ, అంతః కరణా లేకుండా బ్రతకొచ్చు;

స్నేహితులు లేకుండా, పుస్తకాలు లేకుండా బ్రతకొచ్చు;

కానీ ఏ నాగరీకుడూ వంటవాళ్లు (కుక్స్) లేకుండా బ్రతకలేడు.

అతను పుస్తకలు లేకున్నా బ్రతకొచ్చు… జ్ఞానానిదేముంది, వగవడం తప్ప?

ఏ ఆసలూ లేకుండ బ్రతకొచ్చు… ఆశదేముంది, మోసగించడం తప్ప?

అతను ప్రేమలేకుండాకూడా బ్రతకొచ్చు, అనురాగానిదేముంది, కోరికతో కృశించడం తప్ప?


కానీ భోజనం అవసరం లెకుండా బ్రతికే మనిషిని చూపెట్టండి?

.

.
ఓవెన్ మెరెడిత్

8 November 1831 – 24 November 1891

ఇంగ్లీషు కవీ, రాజదూత (భారతదేశంలో 1876-80 ల మధ్య వైస్రాయి)
.

 

.

Lucile: Part 1, Canto 2 Owen Meredith

 

We may live without poetry, music and art;

We may live without conscience and live without heart;

We may live without friends; we may live without books;

But civilized man can not live without cooks.

He may live without books, — what is knowledge but grieving?

He may live without hope, — what is hope but deceiving?

He may live without love, — what is passion but pining?

But where is the man that can live without dining?

.

Owen Meredith

(Owen Meredith is the pseudonym of Edward Robert Bulwer-Lytton, son of Edward George Bulwer-Lytton the novelist.)

Edward Robert Lytton Bulwer-Lytton, 1st Earl of Lytton, GCB, GCSI, GCIE, PC (8 November 1831 – 24 November 1891) was an English statesman and poet. He served as Viceroy of India between 1876 and 1880, including during the Second Anglo-Afghan War, 1878–1880 and the Great Famine of 1876–78.

వసంతమొక అజ్ఞాత హస్తం… ఇ. ఇ. కమ్మింగ్స్, అమెరికను కవి

బహుశా వసంతమొక అజ్ఞాత హస్తం…

(అదెక్కడనుండి అంత జాగ్రత్తగా

పొడచూపుతుందో అంతుచిక్కదు)

జనాలు తొంగి చూసే కిటికీని సవిరిస్తూ

(వాళ్ళు ఒకపక్కనుండి ఆశ్చర్యంగా చూస్తుంటే

వాళ్ళకి బాగా పరిచయమైనవీ, ఏమీ తెలియనివీ

వస్తువుల్ని జాగ్రత్తగా స్థలాలు

మారుస్తూ, ఒక పద్ధతిలో పెడుతూ )

అన్నిటినీ ఎంతో మెళకువతో పరివర్తనచేస్తూ…

వసంతం బహుశా

కిటికీలో మనకి బాగా పరిచయమైన చెయ్యిలాంటిది

(కొత్తవస్తువుల్నీ, పాతవస్తువుల్నీ

చాలా పదిలంగా

మార్పులు చేస్తూ,

మనుషులు జాగ్రత్తగా పరిశీలిస్తుంటే

ఆ పువ్వుని కోణాన్ని ఒక పిసరు అట్నించి ఇటో,

లేదా కాస్త గాలి జొరబడటానికి సందు చేస్తూనో

చకచకా కదులుతుంటుంది)

ఏదీ పగలకుండా నేర్పుగా …

.

ఇ. ఇ. కమ్మింగ్స్

October 14, 1894 – September 3, 1962

అమెరికను కవి

.

.

Spring is like a perhaps hand

.

Spring is like a perhaps hand

(Which comes carefully

out of Nowhere)arranging

a window, into which people look(while

people stare

arranging and changing placing

carefully there a strange

thing and a known thing here)and

 

changing everything carefully

 

spring is like a perhaps

Hand in a window

(carefully to

and from moving New and

Old things, while

people stare carefully

moving a perhaps

fraction of flower here placing

an inch of air there)and

 

without breaking anything.

EE Cummings

October 14, 1894 – September 3, 1962

American poet, painter, essayist, author, and playwright.

ప్రిమ్రోజ్ … రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి

“నాకెందుకు పూలలో యువరాణివంటి

అందమైన కుసుమాన్ని పంపిస్తున్నా?”వని అడుగు

“మంచుముత్యం జతచేసిన ఈ

ప్రిమ్రోజ్ ని ఎందుకు పంపుతున్నా?”వని అడుగు

నీ చెవుల్లో రహస్యంగా చెబుతాను:

ప్రేమలోని తియ్యదనంలో కన్నీళ్ళుగూడా కలగలిసి ఉంటాయని.

“ఈ పువ్వెందుకు పసిడివర్ణంలో ఉన్నా

అంత దీనంగా వాడిపోయినట్టుందేమిటి? అని అడుగు.

“ఈ తొడిమ ఎందుకు బలహీనంగా ఉండి

వంగిపోయినా, రాలిపోవడం లేదేమి?” అని అడుగు

నే బదులు చెబుతాను: అవి ప్రేమికునిలో

అణగారుతున్న ఆశలు ఎలా ఉంటాయో గ్రహిస్తున్నాయని.

.

రాబర్ట్ హెర్రిక్

( నామకరణం 24 ఆగష్టు 1591 –  15 అక్టోబరు 1674)

ఇంగ్లీషు కవి

.

Robert Herrik

.

The Primrose

.

Ask me why I send you here        

This sweet Infanta of the yeere?     

Ask me why I send to you  

This Primrose, thus bepearl’d with dew?  

I will whisper to your eares,                  

The sweets of love are mixt with tears.       

 

 

Ask me why this flower does show

So yellow-green and sickly too?      

Ask me why the stalk is weak        

And bending, yet it doth not break?                 

I will answer, these discover           

What fainting hopes are in a lover.

.

Robert Herrick

(baptised 24 August 1591 – buried 15 October 1674)

English Poet and a Cleric

 

Poem Courtesy:

Parnassus: An Anthology of Poetry. 1880.

Compiled by: Ralph Waldo Emerson, (1803–1882).

http://www.bartleby.com/371/48.html

ఏకాంతము … లార్డ్ బైరన్, ఇంగ్లీషు కవి

తోవచూపట్టని కీకారణ్యాల్లో ఆనందం ఉంది;

ఒంటరి తీరాల్లో అలవిమాలిన పారవశ్యం కలుగుతుంది;

ఎవ్వరూ చొరలేని చోటకూడ సహవాసాలుంటాయి,

గంభీరమైన సముద్రంలోకూడా ఎగసిపడే అలలచప్పుళ్ళున్నట్టు;

మనిషంటే నాకు ప్రేమ తక్కువేం లేదు, ప్రకృతిని ఎక్కువ ప్రేమిస్తా నంతే!

మా ఈ భేటీల్లో  నేను నా రాబోయే జన్మల్లోనో

లేదా గతించిన జన్మల్లోనో ఈ విశ్వంలో విలీనమైన

విషయాలను నెమరువేసుకుంటూ, ఎంతగా అనుభూతిస్తానంటే

నేను మాటల్లో చెప్పలేను; అలాగని అంతా దాచుకోనూలేను.

ఓ అగాధ వినీల సాగరమా!  దొర్లుకుంటూ పో! పొర్లు!

పదివేల నౌకలు నీ మీద నడచుకుంటూపోయినా నీకేం లెక్కలేదు

మనిషి నేల మీద అద్భుతమైన సమాధులు  నిర్మించుకుంటాడు;

వాడి ఆధిపత్యం నీ తీరంతో సరి; నీ విశాల సలిల మైదానాలమీద

జరిగే వినాశమంతా నీ చలవే;  మనిషి చేసే విధ్వంశం

పోలికకి ఏపాటిదీ కాదు; వాడు తనకుతానై చేసుకున్నవి మినహాయిస్తే.

అపుడు, వాన చినుకులా, ఒక్క క్షణంలో,  అంతుదొరకని

నీ లోతుల్లోకి మూలుగుతూ, ఊపిరాడక మునిగిపోతాడు,

సమాధి గాని, శవపేటిక గాని, విషాద ఘంటికలు గాని లేక,  అనామకుడిగా.

.

(From Childe Harold’s Pilgrimage)

లార్డ్ బైరన్

22 జనవరి 1788 – 19 ఏప్రిల్ 1824)

ఇంగ్లీషు కవి

.

.

Solitude

 

There is a pleasure in the pathless woods; 

There is a rapture on the lonely shore;      

There is society where none intrudes,        

By the deep sea, and music in its roar:       

I love not man the less, but nature more,          

From these our interviews, in which I steal           

From all I may be, or have been before,    

To mingle with the universe, and feel         

What I can ne’er express, yet cannot all conceal.  

Roll on, thou deep and dark-blue ocean, roll!              

Ten thousand fleets sweep over thee in vain:        

Man marks the earth with ruin: his control          

Stops with the shore: upon the watery plain         

The wrecks are all thy deed, nor doth remain       

A shadow of man’s ravage, save his own,         

When, for a moment, like a drop of rain,  

He sinks into thy depths with bubbling groan,      

Without a grave, unknelled, uncoffined, and unknown.

.

(From Childe Harold’s Pilgrimage)

 

Lord Byron

(22 January 1788 – 19 April 1824)

English Poet

Poem Courtesy:

Parnassus: An Anthology of Poetry.  1880.

Compiled by: Ralph Waldo Emerson (1803–1882).

(http://www.bartleby.com/371/37.html

 

 

 

సమస్య… పీట్ హెయిన్, డేనిష్ కవి

మనకు బాగా నచ్చిన ప్రణాళికలు

ఎందుకూ కొరగాకుండా పోతాయి

మనం నిర్మించుకున్న అత్యున్నత ఆశాసౌధాలు

కుప్పకూలిపోతాయి

ఎందుకంటే

ముందు ఎంతో చక్కగా గీసిన గీతల్ని

తర్వాత అంత చక్కగానూ

పొరపాటని సరిదిద్దుతాము

.

పీట్ హెయిన్, (కలం పేరు కుంబెల్ (సమాధిరాయి))

16 డిశంబరు 1905- 17 ఏప్రిల్ 1996

డేనిష్ కవి, రచయిత, శాస్త్రజ్ఞుడు, గణితవేత్త,

.

.

On Problems ( A Grook*)

.

Our choicest plans

have fallen through

our airiest castles

tumbled over

 

because of lines

we neatly drew

and later neatly

stumbled over.

.

Piet Hein

16 December 1905 – 17 April 1996

Danish scientist, mathematician, inventor, designer, author, and poet, often writing under the Old Norse pseudonym “Kumbel” meaning “tombstone”.

[Notes:

* Grook : A grook is a form of short aphoristic poem. It was invented by the Danish poet and scientist Piet Hein. He wrote over 7,000 of them, most in Danish or English, published in 20 volumes]

నిమిత్త సుఖం … కెన్నెత్ బర్క్, అమెరికను

నేలంతా పచ్చగా ఉంది

వార్తలు కట్టేసేనేమో

ఈ క్షణంలో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను.

ఒక చేతిలో పుస్తకం

మరో చేతిలో పానీయం

ఇంతకంటే ఏం కావాలి

కీర్తీ

మెరుగైన ఆరోగ్యమూ

ఓ పది మిలియను డాలర్లూ తప్ప?

.

కెన్నెత్ బర్క్

(May 5, 1897 – November 19, 1993)

అమెరికను సాహిత్యవేత్త

.

ఈ కవితలోని మాధుర్యమంతా నగరజీవితానికి అలవాటుపడిన మనల్ని సున్నితంగా వెక్కిరించడంలో ఉంది. మనం ప్రకృతి ఆరాధకులమనీ, శేషజీవితాన్ని ఏ మారుమూలపల్లెలోనో ఈ నగరంలోని కాలుష్యానికీ, వాహనాలరొదకీ, దూరంగా గడిపితే బాగుంటుందని ఎన్నోసార్లు అనుకుని ఉంటాము కూడా. కానీ, నిజంగా అలాంటి జీవితమే గడపవలసి వస్తే, మనకి నగరంలోని అన్ని సౌఖ్యాలూ అందుబాటులో ఉండాలి. Cellphone, TV, దగ్గరలోనే బజారు,  కావలసినపుడు డబ్బులు తీసుకుందికి ATM ఇలా.  నగర జీవితం మనసులో నాటుకుపోయిన మనం ఎంత కష్టపడ్డా పల్లెజీవిత సౌందర్యాన్ని అర్థంచేసుకోనూ లేం, ఆశ్వాదించనూ లేం.

మనకి పల్లెరూపంలో కనపడే పట్టణమే కావాలి.

Kenneth Burke

American Literary Theorist

 

.

Temporary Well Being

.

The pond is plenteous

The land is lush,

And having turned off the news

I am for the moment mellow.

With my book in one hand

And my drink in the other

What more could I want

But fame,

Better health,

And ten million dollars? .

.

Kenneth Burke

(May 5, 1897 – November 19, 1993)

American

The beauty of the poem lies in its subtle dig at our urban mind-set that romanticizes the rural life. We often claim ourselves to be Nature Lovers and yearn to spend our time peacefully in some countryside. But, when it actually comes to living such life, we need all comforts available in the town at handy distance. In a sense, we cannot find peace until we have urbanized the country side.

With an out-and-out urban psyche, we can neither understand nor truly enjoy the rural landscape in all its pristine splendour. What we really crave for is … an urbanized-village.

 

జన్మాంతర వాసనలు… విలియం స్టాఫోర్డ్ , అమెరికను కవి

ఒక్కోసారి విశాలమైన ఆకాశంలోకి

పక్షులు వీడిన జాడ ననుసరిస్తూనో, లేక

కేవలం ఊరికేనో నిరీక్షిస్తూ నిలబడతావు.  

ఏదో లీలగా అనిపిస్తుంది

ఇంతకుముందెప్పుడో ఇలాగే జరిగినట్టు;

అక్కడ ఏదో ప్రశాంతత, పిల్లగాలి వీస్తుంటుంది;

ఎక్కడో సెలయేటి తీరాన్నో, నది ఒడ్డునో;

నీరుబిల్లిలా ఒక్క సారి జాగరూకుడవవుతావు;

నువ్వు ఇప్పుడు చూసిన ఈ విశాల నిరామయ లోకంలాటివే,

వేరు లోకాల్లో మరొకసారి వేగుచుక్కలా ఉదయిస్తావు,

ఒక క్షణ కాలంపాటు, ఈ నిర్నిబంధ ప్రకృతి ఒడిలో.  

2

అడవుల్లో ఏదో గుసగుస వినిపిస్తుంది. నీడల బారులు

దారితీస్తుంటాయి; ఒక కొమ్మ చెయ్యి ఊపుతుంది;

సూర్యుడి కాంతిపుంజమొకటి ఇంతదూరమూ ప్రయాణిస్తుంది;

క్షణకాలంఆగిన ఒక ఆకారం ఏదో చెప్పబోయి,

విరమించుకుని వెనక్కి మరలుతుంది;

దారిలో ఒక గుబురు పొదని కెలుకుతూ పోతుంది.

శతాబ్దాలు అలల్లా గడిచిపోవడం; తరాల

దేశదిమ్మరితనం, కొత్త ప్రదేశాలు కనుక్కోడం

దారితప్పి, మళ్ళీ త్రోవ తెలుసుకోవడం;

తినడం, మరణించడం, మళ్ళీ పుట్టడం,

అడవిలోంచి నడుస్తుంటే నీ వంటిమీది బొచ్చునెవరో నిమరడం

ఇప్పుడు నీకా బొచ్చు లేకపోయినా …. అనుభవమౌతుంటుంది;

అడవిలోని ఒక చీలిన బాటని జాగ్రత్తగా గమనిస్తావు;

నల్లని నీ కళ్ళ చిత్రమైన, దీర్ఘమూ నిశితమూ ఐన చూపులో

నీ ఇంటికోసం వెదుకులాట కనిపిస్తుంది.  

కొన్ని మధురమైన క్షణాలపాటు,

నీ మీసాలు నీ మనసుకంటే వీశాలంగా

అన్నిటినీ అధిగమిస్తూ కనిపిస్తాయి.

.

విలియం స్టాఫోర్డ్

January 17, 1914 – August 28, 1993

అమెరికను కవి

.

Atavism

 

1

Sometimes in the open you look up

where birds go by, or just nothing,

and wait. A dim feeling comes

you were like this once, there was air,

and quiet; it was by a lake, or

maybe a river you were alert

as an otter and were suddenly born

like the evening star into wide

still worlds like this one you have found

again, for a moment, in the open.

 

2

Something is being told in the woods: aisles of

shadow lead away; a branch waves;

a pencil of sunlight slowly travels its

path. A withheld presence almost

speaks, but then retreats, rustles

a patch of brush. You can feel

the centuries ripple generations

of wandering, discovering, being lost

and found, eating, dying, being born.

A walk through the forest strokes your fur,

the fur you no longer have. And your gaze

down a forest aisle is a strange, long

plunge, dark eyes looking for home.

For delicious minutes you can feel your whiskers

wider than your mind, away out over everything.

.

William Stafford 

January 17, 1914 – August 28, 1993

American

కవితా చాతురి … ఆర్చిబాల్డ్ మేక్ లీష్, అమెరికను కవి

ఒక గుండ్రని పండులా,
కవిత స్పర్శకి తెలిసి మౌనంగా ఉండాలి

ఎప్పటివో పాతపతకాలు
బొటనవేలితో మాటాడినట్టు మూగగా మాటాడాలి

నాచుపట్టిన కిటికీపక్క నాపరాయిపలకలు
భుజాలరాపిడికి  అరిగినట్టు చప్పుడుచెయ్యకుండా అరిగిపోవాలి

ఎగురుతున్న పక్షుల్లా
కవిత భాషాతీతంగా ఉండాలి

నెమ్మదిగా నింగినెక్కుతున్న చంద్రుడిలా
కాలానికి తెలియకుండా అది కదలాలి

చీకటికి చిక్కుపడ్డ చెట్లు విస్తరిస్తున్న వెన్నెలలో
ఒకటొకటిగా కొమ్మలు కనిపించినట్టు, అర్థమవాలి

శీతకాలపు చెట్ల ఆకుల వెనక కదిలే చంద్రుడిలా
ఒక్కొక్క జ్ఞాపకపు పొరా విడిచిపెట్టాలి

నెమ్మదిగా నింగినెక్కుతున్న చంద్రుడిలా
కాలానికి తెలియకుండా అది కదలాలి

కవిత సత్యంతో సమానమవాలి తప్ప
సత్యమే కాకూడదు.

ఎందుకంటే దుఃఖ చరిత్ర అంతా
ఖాళీ ద్వారాలూ, ప్రేమ ప్రతీకలే

ప్రేమకోసమే అయితే
ఒదుగుతున్న గడ్డిపోచలూ, సముద్రానికావల రెండు దీపాల్లా ఉండాలి

కవిత ఊహించుకో కూడదు
దానికి అస్తిత్వం ఉండాలి.

.

ఆర్చిబాల్డ్ మేక్ లీష్

May 7, 1892 – April 20, 1982

అమెరికను కవి

.

Archibald MacLeish

.

Ars Poetica (Art of Poetry)

 

.

 

A poem should be palpable and mute

As a globed fruit

 

Dumb

As old medallions to the thumb

 

Silent as the sleeve-worn stone

Of casement ledges where the moss has grown –

 

A poem should be wordless

As the flight of birds

 

A poem should be motionless in time

As the moon climbs

 

Leaving, as the moon releases

Twig by twig the night-entangled trees,

 

Leaving, as the moon behind the winter leaves,

Memory by memory the mind –

 

A poem should be motionless in time

As the moon climbs

 

A poem should be equal to:

Not true

 

For all the history of grief

An empty doorway and a maple leaf

 

For love

The leaning grasses and two lights above the sea –

 

A poem should not mean

But be

.

 

Archibald MacLeish

May 7, 1892 – April 20, 1982

American Poet

 

%d bloggers like this: