అనువాదలహరి

మనసుతో… జాన్ థామస్

వేసవిలో వర్షంలా రోజులిట్టే ఇంకిపోతాయి,

కాలంతో పాటే నిన్ను విడిచిన బాధా  పలచనౌతుంది

ఇంద్రియాలు వాటి జ్ఞానాన్ని కోల్పోయి

పరిణామాలు మసకబారుతాయి.

బొమ్మలు ఏ జ్ఞాపకాలూ నిలుపుకోవు

ఏ విషాదాలూ ఊడిపడవు

నిన్ను ప్రేమిస్తున్నానన్న ఆనందాన్ని

ఇక ఆస్వాదించగలిగే స్థితీ ఉండదు.

నీ సుగంధాన్ని గాలిలో నే పసిగట్టే దాకా,

నా ప్రేమలాగే స్వచ్ఛమైన తెమ్మెర,

నా ఏకాగ్రతని భగ్నం చేసి

నన్ను సందేహంలో ముంచెత్తి

ఒక లిప్తపాటు నా గుండెకొట్టుకోవడం మర్చిపోతుంది.

చాలా కాలం అయింది నిన్ను తాకి, నీ చేరువననుభవించి

నా గుండెని తునాతునకలు చేసుకుని.

నీ వేడికోళ్ళని నేను మరిచిపోవచ్చు,

నీ కన్నుల జాలువారిన ఉపశాంతిని మరిచిపోవచ్చు

కానీ ఇంపైన నీ దేహ పరిమళాన్ని నేను మరువలేను,

అంతకన్నా, అది నా శరీరాన్ని ముసిరిన తీరుని మరిచిపోలేను.

.

జాన్ థామస్

ఈ కవి పరిచయాన్ని ఇవ్వలేనందుకు క్షంతవ్యుణ్ణి.  బహుశా ఇతను  అమెరికను బీట్ కవి John Thomas Idlet  కావొచ్చు.

.

By Heart

 The years pass like summer’s southern rain,

 And time tends to gray the pain,

 Bury the senses and blur the consequences?

 Of leaving you.

 The pictures hold no memories,

 No tragedies ensue.

 No longer can I taste the pleasure,

 The treasure of loving you.

 Until I caught you in the air,

 A current so pure to assure my love.

 Savor my hesitation,

 Raze my concentration,

 And (for a moment) still my heart.

 Long enough to touch, taste, feel you again,

 And tear my soul apart.

 For I can lose sight of the sound of your pleas,

 And escape the ease of your eyes.

 But I’ll never forget the soft scent of your skin,

 And the way that it touched mine.

.

John Thomas

I apologize for my inability to provide any details about the poet. But, he could  possibly be  John Thomas Idlet, the American Beat Poet whom Charles Bukowski hailed as ‘the best unread poet of America’.

.

%d bloggers like this: