సముద్రంలో… క్రిస్టినా రోజేటి, ఆంగ్ల కవయిత్రి

సముద్రం ఎందుకు ఎప్పుడూ అలాఘోషిస్తుంటుంది?

ఆకాశం అందనంతదూరంలో ఉందేమో, అది అలా ఘోషిస్తుంది,

అందుకే చెలియలకట్ట మీద తెగ విసుక్కుంటుంది;

భూమ్మీది ఒడ్లు ఒరిసిపాడే సమస్తనదులూ

సముద్రపు ఆర్తిని తీర్చలేవు. ఇంకా దాహం అంటుంది.

ఎన్నడూ శోధింపబడని దాని భూతలం మీద

అద్భుతమైన అందాలు దాగున్నాయి;

ఏ సంపర్కమూ లేని అపురూపమైన పుష్పాలు, లవణాలూ

సింహపర్ణి పూలలా బ్రతకడానికి సరిపడా,

వ్యాపించి, వృద్ధిచెంది బతకగలిగేలా.

చిత్రమైన వంపులతో, మచ్చలతో, మొనలతో శంఖులు

వెయ్యికళ్ళున్నట్టు ఒకదానిమీద ఒకటి పేరుకుని జీవరాశులు,

అన్నీ అందమైనవే, ఒకలాగ కనిపిస్తూనే ఎంతో భిన్నంగా,

ఏ పురిటి నొప్పులూ లేకుండా పుడుతూ,

ఏ మరణయాతనా లేకుండా మరణిస్తూ, చరిత్రకి అందకుండా.

.

క్రిస్టినా రోజేటి

5 December 1830 – 29 December 1894

ఆంగ్ల కవయిత్రి.

.

Christina Rossetti, English Poetess

.

By The Sea

 

Why does the sea moan evermore?

Shut out from heaven it makes its moan,

It frets against the boundary shore;

All earth’s full rivers cannot fill

The sea, that drinking thirsteth still.

Sheer miracles of loveliness

Lie hid in its unlooked-on bed:

Anemones, salt, passionless,

Blow flower-like; just enough alive

To blow and multiply and thrive.

Shells quaint with curve, or spot, or spike,

Encrusted live things argus-eyed,

All fair alike, yet all unlike,

Are born without a pang, and die

Without a pang, and so pass by.

.

Christina Rossetti

5 December 1830 – 29 December 1894

English Poetess

“సముద్రంలో… క్రిస్టినా రోజేటి, ఆంగ్ల కవయిత్రి” కి 2 స్పందనలు

 1. … ఒకదానిమీద ఒకటి పేరుకుని జీవరాశులు –
  అన్నీ అందమైనవే…
  ఒకలాగ కనిపిస్తూనే ఎంతో భిన్నంగా…
  ఏ పురిటి నొప్పులూ లేకుండా పుడుతూ…
  ఏ మరణయాతనా లేకుండా మరణిస్తూ…

  – చరిత్రకి అందకుండా…

  అద్భుత కవనం…
  అద్భుత అనువాదం…

  kudos…

  .

  చరిత్రకి అందకుండా…

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: