ఆఫీసు స్నేహాలు … గవిన్ ఏవార్ట్, బ్రిటిషు కవి

ఈవ్ కి హ్యూ అంటే తగని ప్రేమ

హ్యూ కి జిమ్ అంటే చాలా మక్కువ.

ఛార్లెస్ కి ఎవరితోనూ పెద్దగా పడదు

ఛార్లెస్ అన్నా ఎవరూ ఎక్కువ ఇష్టపడరు.

మైరా ప్రేమలేఖలు టైపు చేస్తూ కూచుంటుంది

తన అందమైన పియానో కళాకారిణి వేళ్ళతో.

ఫ్రాన్ నించి వీచే అపూర్వమైన సుగంధానికి

డిక్ స్వర్గాన్ని ఊహిస్తూ తన్మయమౌతాడు.

నికీ తన కళ్ళనీ వంపుల్నీ

హొయలుగా నడుస్తూ ప్రకటిస్తుంటుంది

క్లైవ్ మాటాడే ద్వంద్వార్థాలకి

ప్రతివారూ పగలబడి నవ్వుతుంటారు.

అదుపులేని కోరిక వెర్రితలలు వేస్తుంది,

కానీ, అందరినీ చేతనలో ఉంచుతుంది.

భార్యలనుండీ, పనినుండీ అదో ఆటవిడుపు

అంతా 5.30 కాగానే ముగిసిపోతుంది.

.

గవిన్ ఏవార్ట్

4 ఫిబ్రవరి 1916 – 25 అక్టోబరు 1995

బ్రిటిషు కవి

.

.

(ఈ కవితని Wonderingminstrels.blogspot.in blog లోంచి తీసుకున్నాను.

ముందుగా ఆ బ్లాగు నిర్వాహకులకి కృతజ్ఞతలు. ఈ కవితని ఒక అతిథి

చదువరిగా పోస్టు చేస్తూ ‘Vikram Doctor’ అన్న మాటలు జాగ్రత్తగా

గమనించదగ్గవి.

ఇప్పుడు మన జీవితాలలో చాలా భాగం ఆఫీసుల్లోనే గడిచిపోతుంటుంది.

ఆఫీసే మనకుటుంబం నిజానికి. (ఎందుకంటే మెలకువగా ఉన్న

సమయంలో మనం మన సహోద్యోగులతో గడిపినంత సమయం మన

భార్యాపిల్లలతో గడపలేము).  అందుకనే ఆలోచనలలు వెర్రితలలు

వేస్తుంటాయి … కొన్నిసందర్భాలలో ప్రమాదకరమైన పరిణామాలతో …

అంటాడతను.  “ఒకే కుటుంబం” లా బ్రతుకుతారుగనుకనే, అతను

ప్రత్యేకించి Incest అన్న పదాన్ని ప్రయోగించేడు విక్రం తన వ్యాఖ్యలో.

ఆఫీసుల్లో లంచ్ బాక్సులు చూసుకోడాలూ, పంచుకోడాలూ….. ఎప్పుడూ

తిండి, పార్టీలు, మోతాదు మించి తినడాలూ. “ఒక రకమైన

ఇంద్రియపరమైన కోరికలు తీరవు గనక, రెండవ ఇంద్రియపరమైన కోరిక

(తిండి) ఎక్కువ అయిపోతుంది,” అంటాడు.  ఈ పరిశీలనని జాగ్రత్తగా

విశ్లేషించవలసిన అవసరం ఎంతైనా ఉంది. )

.

Office Friendships

.

Eve is madly in love with Hugh

And Hugh is keen on Jim.

Charles is in love with very few

And few are in love with him.

Myra sits typing notes of love

With romantic pianist’s fingers.

Dick turns his eyes to the heavens above

Where Fran’s divine perfume lingers.

Nicky is rolling eyes and tits

And flaunting her wiggly walk

Everybody is thrilled to bits

By Clive’s suggestive talk.

Sex suppressed will go berserk,

But it keeps us all alive.

It’s a wonderful change from wives and work.

And it ends at half past five.

.

Gavin Ewart

4 February 1916 – 25 October 1995

British Poet

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2000/09/office-friendships-gavin-ewart.html?showComment=1394895866237#c4450343560586329852

More importantly,  the commentary by  Mr Vikram Doctor who presented this poem on the

website is worth noting:

I love Ewart, he’s always fun and cool. And offices are sort of cruisy places; especially given the amount of time we spend in them these days, and the modern management emphasis on how we all have to be close and one big family. So we all spend this much time together, and it’s hardly surprising then that our thoughts turn towards incest… with the predictably disastrous consequences.

It’s also why, I think, that all offices I’ve been in are obsessed with food. Everyone is always eating, offering food around, going out for lunches, comparing lunch boxes. Since you can’t have the one kind of sensory gratification, you overdo the other.

Vikram.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: