అనువాదలహరి

ఆదర్శం… జేమ్స్ ఫెన్టన్, ఇంగ్లీషు కవి

నేను వచ్చింది ఇక్కడనుంచి

నేను వెళ్ళినది ఈ త్రోవ.

ఇది చెప్పడానికి కష్టమూ కాదు

అవమానకరం అంతకన్నా కాదు.

 

వ్యక్తిత్వం వ్యక్తిత్వమే.

అదేమీ తెర కాదు.

ఒక వ్యక్తి తనేమిటో

తప్పకుండ గౌరవించాలి.

 

ఇదీ నా గతం

దాన్ని నేను వదులుకో లేను.

ఇది కష్టమే.

కానీ, ఇదే ఆదర్శం.

.

జేమ్స్ ఫెన్టన్

25 April 1949

ఇంగ్లీషు కవి, సాహిత్య విమర్శకుడు.

 

చిన్న చిన్న పదాలతో,  ఆత్మవంచన చేసుకోవడాన్ని (Hypocrisy) నిరసిస్తూ వ్రాసిన చక్కని కవిత. వ్యక్తులే కాదు, కవులు కూడా అంతరంగంలోకి చూసుకోవలసిన సందేశమిచ్చే కవిత.

.

The Ideal

.

This is where I came from.

I passed this way.

This should not be shameful

Or hard to say.

 

A self is a self.

It is not a screen.

A person should respect

What he has been.

 

This is my past

Which I shall not discard.

This is the ideal.

This is hard.

.

James Fenton

25 April 1949

English Poet and Literary Critic.

 

%d bloggers like this: