అనువాదలహరి

సానెట్II … జార్జి శాంతాయన, స్పానిష్- అమెరికన్

నీతోపాటే నాలో కొంతభాగంకూడా మరణించింది.

నా మనో జన వనంలో

శీతగాలి ఒక చెట్టును మోడుని చేసింది.

ఇక మరి అది ఎన్నడూ పచ్చదనానికి నోచుకోదు.

గుడీ, చలికాగేపొయ్యీ, ఊరి రోడ్డూ, సముద్రతీరమూ,

తాము కోల్పోయిన స్నేహానికి అలవాటుపడుతున్నాయి.

మరొకరు, నేనెంతకోరుకున్నా, దొరక లేదు,

ఒక్క రోజుకే, నే నెంతో ముసలివాడినయిపోయాను.

అయినా, నేను నాజ్ఞాపకాలని పదిలపరచుకుంటాను…

నీ ఔదార్యం, లేతహృదయాలకిచ్చే చనవూ

నీస్నేహాన్ని పొందగలిగే గౌరవమూ;

ఒకప్పుడు ఇవి నావి, నాజీవితం వాటితో వన్నెకెక్కింది.

ఇందులో ఏది గొప్పదో నేన్నడిగితే చెప్పలేను:

నేను నీనుంచి మిగుల్చుకున్నదా? నేను కోల్పోయినదా?

.

జార్జి శాంతాయన.

.

George Santayana

.

Sonnet II, from “To W.P.” (Warrick Potter)

.

With you a part of me hath passed away;

For in the peopled forest of my mind

A tree made leafless by this wintry wind

Shall never don again its green array.

Chapel and fireside, country road and bay,

Have something of their friendliness resigned;

Another, if I would, I could not find,

And I am grown much older in a day.

But yet I treasure in my memory

Your gift of charity, and young hearts ease,

And the dear honour of your amity;

For these once mine, my life is rich with these.

And I scarce know which part may greater be,–

What I keep of you, or you rob from me.

.

George Santayana

December 16, 1863 – September 26, 1952

Spanish Philosopher, essayist, poet, and novelist.

%d bloggers like this: