అనువాదలహరి

ప్లాట్ ఫారం పిల్లలు… సీమస్ హీనీ, ఐరిష్ కవి

వేస్తున్న రైలురోడ్డుపక్క మట్టిగుట్ట ఎక్కేం మేము

మా కళ్ళూ … టెలిఫోను స్థంభాలమీది పింగాణీ కప్పులూ…

మెరుస్తున్న తీగలతో సమతలంలో ఉన్నాయి

 

చేతితో అలవోక గీసిన గీతలా

తూర్పునుండి పడమరకి మైళ్ళకు మైళ్ళు

సాగిపోయాయి… పిచ్చుకల బరువుకి వాలిపోతూ.

 

మేం పిల్లలమి, తెలుసుకోవలసినది మాకేం తెలీదు

అనుకుంటున్నాం.  మెరిసే నీటి బిందువుల

రూపంలో మాటలు తీగెల్లోంచి ప్రవహిస్తాయనుకున్నాం.

 

ఆకాశపు అందాలను తనలో నింపుకున్న

ప్రతి తీగా, దాని మీది తళతళలూ, మేమూ

అంతా చారలు చారలుగా కనిపిస్తున్నాం.

 

మేము సూది బెజ్జంలోంచి కూడ దూసుకుపోగలం.

.

సీమస్ హీనీ

ఐరిష్ కవి

.

.

The Railway Children

 .

 When we climbed the slopes of the cutting

 We were eye-level with the white cups

 Of the telegraph poles and the sizzling wires.

 

 Like lovely freehand they curved for miles

 East and miles west beyond us, sagging

 Under their burden of swallows.

 

 We were small and thought we knew nothing

 Worth knowing. We thought words travelled the wires

 In the shiny pouches of raindrops,

 

 Each one seeded full with the light

 Of the sky, the gleam of the lines, and ourselves

 So infinitesimally scaled

 

 We could stream through the eye of a needle.

.

Seamus Heaney

13 April 1939 – 30 August 2013

Irish poet, playwright, translator and recipient of 1995 Nobel Prize in Literature

[Note:

Cutting:                     (British) a trenchlike excavation, especially through a hill, as one made in

constructing a highway.]

%d bloggers like this: