ఆమె జీవితం అంతా బంగారపు ఇసుకని
తెలివితక్కువగా చక్రాలుగా, ముగ్గులుగా
అరచేతి వేళ్లసందుల్లోచి జారనిస్తూ
ఇసుకకోటలు కట్టడానికే సరిపోయింది.
హరివిల్లులు ఒకదానివెనకఒకటివచ్చినట్టు
మంచిరోజులు కట్టగట్టుకుని వచ్చినా
వాటినన్నిటినీ ఆమె తృణప్రాయంగా విసిరేసింది
కుళ్ళు కాలవలో సుడులుతిరుగుతూ పోయేట్టు.
ఆమె కొరకు ఒక కొత్త గులాబీ మొగ్గని వదిలి
మీ మానాన్న మీరు వెళ్ళండి; జాలి పడొద్దు;
ఆమె హాయిగానే జీవించింది; ఆమెకి తెలుసు, తను
మట్టిలోకలిసినా, అదీ అందంగా ఉంటుందని.
.
డొరతీ పార్కర్.
August 22, 1893 – June 7, 1967
అమెరికను కవయిత్రి.
.

స్పందించండి