ప్రార్థన … కెరోల్ ఏన్ డఫీ, బ్రిటిషు కవయిత్రి

ఒక్కో సారి, మనం ప్రార్థన చెయ్యకపోయినా,

ప్రార్థన దానంతట అదే నోటంట వస్తుంది;

ఒకోసారి చేతుల జల్లెడలోంచి ఓ స్త్రీ తలెత్తి పైకి చూసి

అనుకోని వరం లాంటి చెట్లుపాడే శృతులు వింటుంది.

మనకి విశ్వాసం లేకపోవొచ్చు గాని, కొన్ని రాత్రుళ్ళు సత్యం

మనగుండెల్లో జొరబడి సన్నగా సలుపుతుంది; అప్పుడు మనిషి

చెట్టుబోదెలా నిశ్చలంగా నిటారుగా నిలబడి దూరంగా పట్టాలమీద

అర్థంకాని రైలుపాటలో తన యవ్వన గీతాల్ని  వింటాడు.

ఇప్పుడు మాకై ప్రార్థించండి. సత్రంనుండి నగరాన్ని వీక్షిస్తున్న యాత్రికుణ్ణి,

పియానోనేర్చుకుంటున్నవిద్యార్థి తొలి రెండు మెట్ల సాధన ఊరడిస్తున్నాది.

అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు; ఎవరో ఎక్కడినుండో పిలుస్తున్నారు

ఒక బిడ్డని పేరుపెట్టి … ఏదో కోల్పోయినట్టు.

బయట అంతా చీకటి. లోపల రేడియోలో  ప్రార్థన…

రాకాల్, మేలిన్. డాగర్, ఫినిస్ టెరే…

.

కెరోల్ ఏన్ డఫీ

Dec 23, 1955

బ్రిటిషు కవయిత్రి

ఈ కవిత అర్థం చేసుకోవడానికి కొంచెం శ్రమించాలి.  ఒక తాత్త్విక భావనకి  ఒక సామాజిక నేపధ్యం సమకూర్చింది కవయిత్రి.  మనిషి ఒంటరి. ఏ అస్థిత్వమూ ఉండదు.  అతని చర్యలలో  ప్రత్యేకత కంటే సామాన్యత ఎక్కువ . అందుకే ఈ కవితలో పెర్కొన్న స్త్రీకిగాని, పురుషుడుకిగాని, యాత్రికుడికిగాని ఒక అస్తిత్వం లేదు.  అందరూ మనలాటి వాళ్ళే. Prayer (Pray)  అన్న పదాన్ని  ప్రార్థన అన్న అర్థమేగాక  … A slight chance  అన్న అర్థంలో కూడా వాడింది కవయిత్రి.  మొదటి ‘నాలుగు పాదాల్లో’  ఒక అజ్ఞాత స్త్రీ  పగటిపూట తన నిరాశా నిస్పృహలనుండి మేలుకుని కలకూజితాలు వింటుంది; రెండో ‘నాలుగు పాదాల్లో’ రాత్రిపూట ఒక పురుషుడు దూరంగా కదుల్తున్న రైలు పట్టాల చప్పుడులో తన యవ్వన గీతాల్ని విని బాధోపశమనం పొందుతాడు;  మూడవ ‘నాల్గు పాదాల్లో’ మరొక అజ్ఞాత యాత్రికుడు పియానో మెట్లలో ఊరటపొందుతాడు;  చివరి ద్విపదలో చెప్పిన చీకటి  జీవితంలోని నిరాశ.  లోపల రేడియోలో ప్రార్థన అన్నది … (ఇక్కడ చెప్పిన ప్రదేశాలలో కొన్నీ BBCలో Shipping Forecastలో ఉపయోగించే ప్రదేశాలు. ) ఒక మెటఫర్. రోజూ రాత్రిపూట ప్రార్థన చేసుకునే అలవాటులాంటిది.

జీవితంలోని శూన్యతనుండి బయటపడడం ఒక Chance Event .

.

Prayer

 .

Some days, although we cannot pray, a prayer

utters itself. So, a woman will lift

her head from the sieve of her hands and stare

at the minims sung by a tree, a sudden gift.

 

Some nights, although we are faithless, the truth

enters our hearts, that small familiar pain;

then a man will stand stock-still, hearing his youth

in the distant Latin chanting of a train.

 

Pray for us now. 2 Grade 1 piano scales

console the lodger looking out across

a Midlands town. Then dusk, and someone calls

a child’s name as though they named their loss.

 

Darkness outside. Inside, the radio’s prayer –

Rockall. Malin. Dogger. Finisterre.

.

Carol Ann Duffy

Dec 23, 1955

English Poetess

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2002/01/prayer-carol-ann-duffy.html

For detailed understanding of the poem: http://www.squidoo.com/carolannduffy

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: