రోజు: మార్చి 2, 2014
-
ప్రార్థన … కెరోల్ ఏన్ డఫీ, బ్రిటిషు కవయిత్రి
ఒక్కో సారి, మనం ప్రార్థన చెయ్యకపోయినా, ప్రార్థన దానంతట అదే నోటంట వస్తుంది; ఒకోసారి చేతుల జల్లెడలోంచి ఓ స్త్రీ తలెత్తి పైకి చూసి అనుకోని వరం లాంటి చెట్లుపాడే శృతులు వింటుంది. మనకి విశ్వాసం లేకపోవొచ్చు గాని, కొన్ని రాత్రుళ్ళు సత్యం మనగుండెల్లో జొరబడి సన్నగా సలుపుతుంది; అప్పుడు మనిషి చెట్టుబోదెలా నిశ్చలంగా నిటారుగా నిలబడి దూరంగా పట్టాలమీద అర్థంకాని రైలుపాటలో తన యవ్వన గీతాల్ని వింటాడు. ఇప్పుడు మాకై ప్రార్థించండి. సత్రంనుండి నగరాన్ని వీక్షిస్తున్న […]