అనువాదలహరి

జీవన శకటం … అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి

ఉండుండి అదిమొయ్యవలసిన బరువు భారమైనా

ఈ శకట గమనం నెమ్మదిగా సాగుతుంటుంది;

జుత్తు నెరిసిన సాహస కాల చోదకుడు

బండి మొగలులో సుఖంగా కూచిని తోలుతుంటాడు.

ప్రాభాతవేళ  దానిలోకి ఉత్సాహంతో దూకి

ఒక అద్భుతమైన ప్రయాణానికి సిద్ధపడతాం.

సోమరితనాన్నీ, అలసటనీ లక్ష్యపెట్టకుండా

మనం  అరుస్తాం: “ఊం! త్వరగా! మనం అక్కడికి చేరుకోవాలి”

కానీ మధ్యాహ్నమయే సరికి మన ధైర్యం సన్నగిలితుంది,

మనం భయపడతాం; ఆ సమయానికి

కొండలూ లోయలూ భీతావహంగా కనిపిస్తాయి. అప్పుడు,

“ఓ, సారధీ! మూర్ఖుడా! నెమ్మదిగా పోనీ!” అని అరుస్తాం.

బండి మాత్రం ఎప్పటిలాగే పోతుంటుంది.

సాయంత్రం అయే వేళకి మనం దానికి అలవాటు పడిపోతాం,

మన విశ్రాంతి శిబిరం చేరేవేళకి జోగుతుంటాం;

కాలం మాత్రం గుర్రాలని ఎప్పటిలా ముందుకి పరిగెత్తిస్తూనే ఉంటుంది.

.

అలెగ్జాండర్ పుష్కిన్

6 June 1799 – 10 February 1837

రష్యను మహాకవి.

.

Alexander Pushkin

.

The Coach Of Life

.

Although her load is sometimes heavy,

The coach moves at an easy pace;

The dashing driver, gray-haired time

Drives on, secure upon his box.

At dawn we gaily climb aboard her

We’re ready for a crazy ride,

And scorning laziness and languor,

We shout: ‘Get on, there! Don’t delay!’

But midday finds our courage wane,

We’re shaken now: and at this hour

Both hills and dales inspire dread.

We shout: ‘Hold on, drive slower, fool!’

The coach drives on just as before;

By eve we are used to it,

And doze as we attain our inn.

While Time just drives the horses on.

.

Alexander Sergeyevich Pushkin

6 June 1799 – 10 February 1837

Poem Courtesy:

http://www.poemhunter.com/i/ebooks/pdf/alexander_sergeyevich_pushkin_2012_6.pdf

%d bloggers like this: