తేలికపాటి చినుకులు పడి సముద్రమ్మీద ముడుతలు పడుతాయి
తర్వాత వెంటనే మాయమైపోతాయి అస్సలు జాడలేకుండా.
మనకి అక్కడ వర్షం పడిందని కూడా తెలీదు
ప్రతిచినుకూ గుండ్రంగా చేసిన ముడతలు చూసి ఉండకపోతే.
అలాగే, కొన్ని ఆత్మలు మనజీవితంల్లో ముడుతలు సృష్టించి
ఈ తనూవారాశి అలజడుల్లో సమసిపోతాయి.
జీవితవదనంమీద ఈ ముడుతలు లేకపోయి ఉంటే
ఆత్మకి అక్కడ చోటుందని కూడా ఎవరికీ ఎరుక ఉండదు.
.
సిడ్నీ లేనియర్
February 3, 1842 – September 7, 1881)
అమెరికను కవి, సంగీతకారుడూ.
.
Sidney Lanier
.
Souls And Rain-Drops
.
Light rain-drops fall and wrinkle the sea,
Then vanish, and die utterly.
One would not know that rain-drops fell
If the round sea-wrinkles did not tell.
So souls come down and wrinkle life
And vanish in the flesh-sea strife.
One might not know that souls had place
Were’t not for the wrinkles in life’s face.
.
Sidney Lanier
February 3, 1842 – September 7, 1881)
American Musician and Poet
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తూంది…