అనువాదలహరి

భల్లూకపు కౌగిలి … మైకేల్ ఓండాట్షీ, కెనేడియన్ కవి

తనదగ్గరకి వచ్చి గుడ్ నైట్ చెప్పి ముద్దివ్వమంటాడు గ్రిఫిన్.

అలాగేలే అని నేను అరుస్తాను. చేస్తున్నపని పూర్తిచేసి,

తర్వాత మరొకటి, మరొకటి పూర్తిచేసి

మెల్లిగా నడుచుకుంటూ మా కుర్రాడి గదివేపు తిరుగుతాను.

వాడు నవ్వుతూ రెండుచేతులూ చాచుకుని నేనివ్వబోయే

భల్లూకపు కౌగిలివంటి  గాఢాలింగనానికి ఎదురుచూస్తుంటాడు.

అయినా, నా ఆనురాగానికి ఆ అమానవీయమైన పేరేమిటి?

గట్టిగా హత్తుకుంటే మృత్యువు చూపిస్తుందది.

నేను హత్తుకుంటే, వాడి లేత ఎముకలూ

వెచ్చని మెడా నన్ను అతుక్కుంటాయి.

ఆ పైజమాలోని సన్నని బిగువైన శరీరం నన్ను

రక్తానికి అతుక్కునే సూదంటురాయేమోన్నట్టు పెనవేసుకుంటుంది.

ఇంతకీ వాడు పాపం ఎంతసేపటినుండి  అలా

నేను వస్తానని ఎదురుచూస్తున్నాడో?

.

మైకేల్  ఓండాట్షీ

కెనేడియన్ కవి

.

Michael Ondaatje

.

Bear-hug

.

Griffin calls to come and kiss him goodnight

I yell ok. Finish something I’m doing,

then something else, walk slowly round

the corner to my son’s room.

He is standing arms outstretched

waiting for a bear-hug. Grinning.

Why do I give my emotion an animal’s name,

give it that dark squeeze of death?

This is the hug which collects

all his small bones and his warm neck against me.

The thin tough body under the pyjamas

locks to me like a magnet of blood.

How long was he standing there

like that, before I came?

.

Michael Ondaatje 

September 12, 1943

Srilankan-born Canadian Poet and Novelist.

%d bloggers like this: