అనువాదలహరి

ముదిమి – వయసు… ఫ్రాన్సిస్ విలియం బూర్డిలాన్, ఇంగ్లీషు కవి.

చాలాకాలం క్రిందట, ఒక వేసవి ఉదయాన

ఆడుకుంటున్న పాప పక్కనించి వెళ్ళాను;

అలా పక్కకి రాగానే, చిన్నతనపు ఉత్సాహంతో

“దా! మనిద్దరం ఆడుకుందాం!” అని పిలిచింది.

 

కానీ నా చూపులు దూరానున్న శిఖరం మీద ఉన్నాయి

చీకటిపడేలోగా అదెక్కగలిగితే సంతోషమే.

అందుకని కొంత అసహనంతో అన్నాను: ” లేదు!

నేను నీతో ఆడడానికి మరీ ముసలివాడిని” అని.

 

చాలా ఏళ్ళు గడిచిపోయేక, శీతకాలంలో

నా కాళ్ళలో కొండలెక్కగల సత్తా సన్నగిలేక

చక్కని పచ్చికబయల్లో ఒక పాపని దాటిపోతూ,

ఆమెని పిలిచి,”దా! మనిద్దరం ఆడుకుందాం!” అన్నాను.

 

ఆమె దృష్టంతా కథల పుస్తకం మీద ఉంది;

ఆశ్చర్యంతో విప్పారిన కళ్ళని ఎత్తైనా చూడకుండా

పిల్లలకి సహజమైన చికాకుతో సమాధానం ఇచ్చింది,

“లేదు! నేను ఆడడానికి మరీ చిన్నపిల్లని కాను.” అని.

.

ఫ్రాన్సిస్ విలియం బూర్డిలాన్

22 మార్చి 1852 – 13 జనవరి 1921

ఇంగ్లీషు కవి, అనువాదకుడు

 

.

Francis William Bourdillon

.

Old And Young

.

Long ago, on a bright spring day,

I passed a little child at play;

And as I passed, in childish glee

She called to me, “Come and play with me!”

 

But my eyes were fixed on a far-off height

I was fain to climb before the night;

So, half-impatient, I answered, “Nay!

I am too old, too old to play.”

 

Long, long after, in Autumn time—

My limbs were grown too old to climb—

I passed a child on a pleasant lea,

And I called to her, “Come and play with me!”

 

But her eyes were fixed on a fairy-book;

And scarce she lifted a wondering look,

As with childish scorn she answered, “Nay!

I am too old, too old to play!”

.

Francis William Bourdillon

22 March 1852 – 13 January 1921

British poet and translator

%d bloggers like this: