అనువాదలహరి

ఎడబాటు… థామస్ స్టాన్లీ, ఇంగ్లీషు కవి

నా ప్రియమైన స్వామీ! దూరంగా వెళ్తున్నా

నీ కౌగిటినుండి విడదీయబడి

నన్ను సమ్మోహపరచిన వాటికంటె

న్యూనమైన ఆకర్షణలవైపు.

ఇక ముందెప్పుడైనా దుఃఖమే నన్ను

పొట్టనబెట్టుకుందని నీకు తెలిస్తే, రా!

నా సమాధిమీద

ఒకటో, రెండో కన్నీటి చుక్కలు రాల్చు.

నీ నిట్టూర్పులతో నా ప్రశాంతమైన నిద్రని భగ్నం చెయ్యి.

నీ రోదన విని, మృతిలో కూడా నేను హర్షిస్తాను

ఏమో! నీ కన్నీళ్ళకి

నా చితాభస్మాన్ని కొత్త జీవంతో

నింపగల సత్తా ఉండొచ్చు,

లేదా నన్నొక పువ్వుగా మార్చొచ్చు,

అది నీగుండెలమీద ఉంచినపుడు నేను ఎదగొచ్చు,

ఆ రూపం ముసుగులో,

నేను తిరిగి నీతో జంటగా కలిసి మనొచ్చు …

నిను చుంబిస్తూ, తాకుతూ, ఆనందించొచ్చు.

మనల్ని చూసి అసూయపడే వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ

మృత్యువు చేసిన ఎడబాటులోనూ కలిసే ఉండొచ్చు.

.

థామస్ స్టాన్లీ

1625 – 12 April 1678

ఇంగ్లీషు రచయితా,  అనువాదకుడూ

.

Thomas Stanley

                                       Sir Thomas Stanley

(1625 – 12 April 1678)

The Parting

    .

I go dear Saint, away,         

      Snatch’d from thy arms   

    By far less pleasing charms,        

    Than those I did obey;        

  But if hereafter thou shalt know              

    That grief hath killed me, come,   

      And on my tomb    

    Drop, drop a tear or two;   

Break with thy sighs the silence of my sleep,      

And I shall smile in death to see thee weep.                  

 

   

Thy tears may have the power         

      To reinspire   

    My ashes with new fire,     

    Or change me to some flower,      

  Which, planted ’twixt thy breasts, shall grow:           

      Veil’d in this shape, I will

      Dwell with thee still,         

    Court, kiss, enjoy thee too:

Securely we’ll contemn all envious force,  

And thus united be by death’s divorce.

 

.

 

 Thomas Stanley

(1625 – 12 April 1678)

English Author and Translator

(Poem Courtesy: http://www.bartleby.com/332/60.html)

%d bloggers like this: