అనువాదలహరి

శిశువు… సిల్వియా ప్లాత్, అమెరికను కవయిత్రి

Snowdrops

Image Courtesy: http://www.plant-and-flower-guide.com/snowdrop-flower.html

.

నిర్మలమైన నీ కనులు అత్యంత సుందరంగా ఉన్నాయి.

వాటిని నేను రంగులతో, పక్షులతో నింపదలుచుకున్నాను,

ఒక కొత్త జంతు ప్రపంచం

దానికేపేరు పెడతావో నువ్వే ఊహించు—

‘తుహినకుసుమ’మా, మోహన మురళీ

చిన్నారీ…

మొనదేరిన అంకురం,

పోలికలు ఉదాత్తంగా

సాంప్రదాయికంగా ఉండే సరస్సు…

వ్యాకులమైన మనసుతో

చేతులు నులుపుకుంటూ,

చుక్కలెరుగని చూరుకింద కూచోడం కాదు.

.

సిల్వియా ప్లాత్

October 27, 1932 – February 11, 1963

అమెరికను కవయిత్రి

(గమనిక: Snowdrop అన్నది తెల్లగా, స్వచ్ఛంగా ఉండే పువ్వు )

సిల్వియా ప్లాత్ కవితలు సాంప్రదాయకమైన శిల్పంతో ఉండవు. చాలా పదాలు ఊహించికోవలసిందే.  కేవలం పదచిత్రాలు మాత్రమే ఇవ్వబడతాయి.  ఈ కవిత శీర్షిక చదవగానే మహాకవి గుర్రం జాషువా గారి ఆణిముత్యాల్లాంటి పద్యాలు గుర్తుకు రాకమానవు. (http://www.youtube.com/watch?v=yoUFWJrOsrk)

.

Sylvia Plath

.

Child

.

Your clear eye is the one absolutely beautiful thing.

I want to fill it with color and ducks,

The zoo of the new

Whose name you meditate–

April snowdrop, Indian pipe,

Little

Stalk without wrinkle,

Pool in which images

Should be grand and classical

Not this troublous

Wringing of hands, this dark

Ceiling without a star.

.

Sylvia Plath

October 27, 1932 – February 11, 1963

American Poet, Novelist and Short Story Writer.

%d bloggers like this: