రోజు: జనవరి 31, 2014
-
దురహంకారం … జాన్ వెబ్స్టర్, ఇంగ్లీషు కవి
వసంత ఋతువులోని పూలన్నీ మన సమాధులని గుబాళింపజెయ్యడానికి సరిపోతాయి; పాపం అవన్నీ మంచి వయసులో ఉన్నాయి, మనిషి చూడబోతే అలంకరించుకునేది కాసేపే: పుట్టినప్పటినుండి మన ప్రగతి ఒక సారి గమనించండి మనం పుడతాం, పెరుగుతాం, తిరిగి మట్టిలో కలుస్తాం. టాటాలు చెప్పుకుంటాం, అన్ని సుఖాలకీ, అన్ని బలహీనతలకీ వశమౌతాము ! తియ్యని మాటైనా, నిశితమైన చూపైనా, పరిమళాల్లా, నాలుగుదిక్కులా వ్యాపించి నశించవలసిందే. సూర్యుడికోసం నిరీక్షించే నీడలా, అందుకనే, ఈ తంతు అంతా జరుగుతుంటుంది. రారాజుల నిష్ఫలమైన కోరిక, […]