అనువాదలహరి

దైవానికి ప్రేమగీతాలు… రిల్కే, ఆస్ట్రియన్ కవి

నువ్వే భవిష్యత్తువి,

ప్రభాత సంధ్యల విశాల కాలమైదానాల విరిసే

అరుణారుణ గగనానివి నువ్వు.

నిశాంతాన్ని సూచిస్తూ కూసే తొలికోడి కూతవి,

తుహిన బిందువువీ, ప్రాభాత భేరీవీ,

కన్నియవీ, అపరిచితుడివీ, తల్లివీ, మృత్యువువ్వీ నువ్వే.

మేము కనీ వినీ ఎరుగని కారడవిలా…

మేము కీర్తించక, శోకించక, వర్ణించక గడిపే

మా దైనందిన జీవితాలలోంచి ప్రభవించే అనేకానేక

రూపాలుగా నిన్ను నువ్వు సృజించుకుంటావు

వస్తువులలోని అంతరాంతర ప్రకృతివి నువ్వు,

ఎన్నడూ నిర్థారించి చెప్పలేని తుది పలుకువి నువ్వు.

మాకొక్కరికీ ఒక్కొక్కలా నువ్వు గోచరమౌతావు

నావకి తీరంలానూ, తీరానికి నావలానూ.

.

రైనర్ మారియా రిల్కే,

4 December 1875 – 29 December 1926

బొహీమియన్- ఆస్ట్రియన్ కవి

ఈ కవితలో అత్యంత సుందరమైన ఉపమానం నామట్టుకి చివరి వాక్యమే.

.

Rainer Maria Rilke

.

The Book of Pilgrimage, II, 22

.

You are the future,

the red sky before sunrise

over the fields of time.

You are the cock’s crow when night is done,

You are the dew and the bells of matins,

maiden, stranger, mother, death.

You create yourself in ever-changing shapes

that rise from the stuff of our days —

unsung, unmourned, undescribed,

like a forest we never knew.

You are the deep innerness of all things,

the last word that can never be spoken.

To each of us you reveal yourself differently:

to the ship as coastline, to the shore as a ship.

.

(Sub Title: Book of Hours : Love poems to God

Translated from the German by Anita Barrows.)

.

Rainer Maria Rilke

4 December 1875 – 29 December 1926

Bohemian-Austrian Poet and Novelist

(Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/2001/09/book-of-pilgrimage-ii-22-rainer-maria.html)

%d bloggers like this: