అనువాదలహరి

అర్థరాత్రి నిద్రలో… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను

1

అర్థ రాత్రి నిద్రలో, వ్యధాభరితమైన అనేక ముఖాలు,

చూడటానికి ప్రాణాంతకంగా గాయపడ్డ చూపులు —

                               వర్ణించనలవిగాని ఆ చూపులు;

వెల్లకిలాపడిన నిహతులు, చేతులు బార్లా జాపుకుని,

కలగంటి, కలగంటి, కలగంటి.

2

ప్రకృతి దృశ్యాలు, పంటచేలు, మహానగాలు,

తుఫానువెలిసిన తర్వాతి అందమైన ఆకాశాలు…

రాత్రిపూట అద్భుతంగా ప్రకాశిస్తూ చందమామ

తళతళా మెరుస్తూ,  క్రింద మేము కందకాలు తవ్వుతూ

మట్టి పోకలుపోస్తున్న చోట కాంతి ప్రసరిస్తూ,

కలగంటి కలగంటి కలగంటి

3

అవన్నీ గతించిపోయి ఎన్నేళ్ళో అయింది

— ఆ ముఖాలూ, ఆ కందకాలూ, ఆ పంటచేలూ…;

అక్కడి మారణహోమం నుండి,

నిర్లక్ష్యంతో కూడిన స్థైర్యంతో,

రాలిపోయిన వారికి దూరంగా,

ముందుకి కాలంతో పాటు పరిగెత్తేను.

కానీ ఇప్పుడు ఆ  ఆకారాలన్నీ రాత్రిపూట

కలగంటున్నా, కలగంటున్నా, కలగంటున్నా.

.

(From Leaves Of Grass)

.

వాల్ట్ వ్హిట్మన్

31 మే, 1819 – మార్చి 26, 1892

అమెరికను కవి

ఈ కవితలో గొప్ప సౌందర్యం ఉంది. ఈ కవిత ఒక వృద్ధసైనికుడి జ్ఞాపకాలగురించి అయినప్పటికీ, ఈ పరివేదన అందరికీ  చెందుతుంది.  జీవితం ఒక గొప్ప పోరాటం అనుకుంటే, మనకంటే ముందు గతించిపోయిన వారందరూ యుద్ధంలో నిహతులక్రిందే లెక్క. మనం వాళ్ళందరి నుండి కాలంతో పాటు పరిగెత్తుకుని వచ్చాం.  ఆ ముఖాలు అప్పటంత ప్రస్ఫుటంగా ఉండకపోవచ్చు.  మసకబారినా ఆముఖాలే మనకళ్ళకి నిద్రలో కనిపిస్తాయి.

.

.

In Midnight Sleep

1

In midnight sleep, of many a face of anguish,

Of the look at first of the mortally wounded—

                        of that indescribable look;

Of the dead on their backs,

                        with arms extended wide,

I dream, I dream, I dream.

2

Of scenes of nature, fields and mountains;

Of skies, so beauteous after a storm—

                        and at night the moon so unearthly bright,

Shining sweetly, shining down,

                        where we dig the trenches and gather the heaps,

I dream, I dream, I dream.

3

Long, long have they pass’d

                         — faces and trenches and fields;

Where through the carnage

                                I moved with a callous composure

                         — or away from the fallen,

Onward I sped at the time

                         — But now of their forms at night,

    I dream, I dream, I dream.

.

(From Leaves Of Grass)

.

Walt Whitman

(May 31, 1819 – March 26, 1892)

American

%d bloggers like this: