అనువాదలహరి

రోజులు… ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి.

రోజులెందుకున్నాయి?

మనం బ్రతికేది వాటిలోనే.

అవివస్తుంటాయి, పదేపదిసార్లు

మేల్కొలుపుతూ ఉంటాయి.

మనం సుఖంగా బ్రతకవలసింది అందులోనే.

వాటిలో తప్ప ఇంకెక్కడ మనం బ్రతకగలం?

ఆహ్! ఈ సమస్యకి సమాధానం కనుక్కోడమే తడవు

వైద్యుడూ,  పురోహితుడూ

వాళ్ళ వాళ్ళ పొడవాటి దుస్తుల్లో

పొలాలంబడి పరిగెత్తుకుంటూ వస్తున్నారు.

.

ఫిలిప్ లార్కిన్

9 ఆగష్టు 1922 – 2 డిశంబరు 1985

ఇంగ్లీషు కవీ, నవలాకారుడూ, గ్రంధాలయాధికారి.

ఈ కవితలో  చివరి పాదాల్లో చూపించిన చమత్కారంతో దీని సౌందర్యం ఒక్కసారిగా పెరిగిపోయింది.   ఇక్కడ పురోహితుడంటే అపరకర్మలు చేసే పురోహితుడుగానే తీసుకోవాలి.  మనం “జీవితం ఇక్కడే జీవించాలి , ఇక్కడ సుఖపడటం తప్ప వేరే మార్గం లే”దన్న సత్యం తెలుసుకోగలిగితే, మన ఆరోగ్యమూ కుదుటపడుతుంది,  మనకి వైద్యుడి అవసరమూ ఉండదు, పురోహితుడి అవసరమూ ఉండదు. మనుషులకి ఆ ఎరుక లేనంతకాలమే వాళ్ళ వృత్తి లాభసాటిగా నడుస్తుంది.  ప్రజలకి ఈ తెలివికలిగితే, వాళ్లకి జీవిక దొరకదు. అందుకనే వాళ్ళు పుంజాలుతెంపుకుంటూ పొలాలవెంబడి పరిగెత్తుకొస్తున్నది. అదే ఈ కవితలోని చమత్కారం. 

.

Philip Larkin

.

Days

.

What are days for?

Days are where we live.

They come, they wake us

Time and time over.

They are to be happy in:

Where can we live but days?

Ah, solving that question

Brings the priest and the doctor

In their long coats

Running over the fields.

.

Philip Larkin

9 August 1922 – 2 December 1985

English Poet, Novelist and Librarian.

%d bloggers like this: