రోజు: జనవరి 18, 2014
-
రిటర్ శిఖరం అధిరోహిస్తూ జాన్ మూర్… గేరీ స్నైడర్, అమెరికను.
దాని ముఖాన్ని పదే పదే జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఎక్కడం ప్రారంభించేను , నా పట్టులు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ. సగం దూరం ఎక్కిన తర్వాత ఒక్కసారిగా ఆగిపోవలసి వచ్చింది… రెండుచేతులూ బారజాపి, కొండముఖానికి దగ్గరగా అతుక్కుని వేలాడుతూ, చెయ్యి గాని కాలు గాని క్రిందకిగాని మీదకిగాని కదపలేక. ఇక నా పతనం నిశ్చయం అయిపోయినట్టే. ఇక పడిపోక తప్పదు. ఒక క్షణం నివ్వెరపాటు, తర్వాత, నిర్జీవంగా కొండ అంచునుంది క్రిందనున్న మంచుదిబ్బలమీదకి దొర్లుకుంటూపోవడమే. ఉక్కిరిబిక్కిరిచేస్తున్న ఆలోచనలతో…