అనువాదలహరి

గడ్డిపరక… బ్రయన్ పాటెన్, ఇంగ్లీషు కవి

నువ్వో కవిత కావాలంటావు

నీకో గడ్డిపరక అందిస్తాను.

నువ్వు అదేం బాగులేదు

కవితని ఇవ్వమని అడుగుతావు.

ఈ గడ్డిపరక సరిపోతుందిలే,

ఇది చక్కని మంచువలిపాలు చుట్టుకుంది

నేను రాయబోయే ఏ ప్రతీకకన్నా

ఇది చాలా సన్నిహితమూ, పరిచయమైనదీను అంటాను.

“ఇది కేవలం గడ్డిపరకంటే గడ్డిపరక

అసలిది కవిత్వం కానే కాదు

ఇదెంతమాత్రం సరిపోదు,” అంటావు.

నేను నీకు గడ్డిపరకనే ఇస్తాను.

నీకు చాలా కోపం వస్తుంది.

గడ్డిపరక ఇవ్వడం సులభం అంటావు.

ఇది అర్థ రహితం.

గడ్డిపరక ఎవడైనా ఇస్తాడంటావు.

నువ్వు కవిత ఇవ్వమని అడుగుతావు.

నేను గడ్డిపరక ఇవ్వడం

రాను రాను ఎంతకష్టమో

ఒక విషాదాంత కావ్యం రాస్తాను.

వయసు పెరుగుతున్న కొద్దీ

ఒక గడ్డిపరకని స్వీకరించడం

ఎంతకష్టమో కూడా రాస్తాను.

.

బ్రయన్ పాటెన్

7 ఫిబ్రవరి 1946

ఇంగ్లీషు కవి

.

ఈ పద్యంలో నాకు అర్థమయినంతవరకు, చమత్కారం గడ్డిపరకని ప్రతీకగా తీసుకుని, చివర ఇచ్చిన ముగింపులోఉంది. గడ్డిపరక ఒక సామాన్య జీవితానికి ప్రతీక. సామాన్య జీవితం కవితా వస్తువు కాదన్నది అనూచానంగా వస్తున్న అపోహ. జీవితంలోని సంక్లిష్టత, సామాన్య జీవనం ఎంత అరుదుగా ఉంటుందో చెప్పడమే గడ్డిపరక ఇవ్వలేకపోవడం అన్నది విషాదాంత కావ్యంగా రాయడం. అంతే కాదు, గాడ్డి గొప్పగొప్ప సమాధులమీద కూడా మొలుస్తుంది. అందుకే వయసు పెరుగుతున్న కొద్దీ గడ్డిపరకని  స్వీకరించలేకపోవడం. (ఒక రకమైన భయం.)

Brian Patten

Image Courtesy: http://www.walker.co.uk/walkerdam/getimage.aspx?class=person&id=2368&size=powerpoint

.

Blade of Grass

.

You ask for a poem.

I offer you a blade of grass.

You say it is not good enough.

You ask for a poem.

I say this blade of grass will do.

It has dressed itself in frost,

It is more immediate

Than any image of my making.

You say it is not a poem,

It is a blade of grass and grass

Is not quite good enough.

I offer you a blade of grass.

You are indignant.

You say it is too easy to offer grass.

It is absurd.

Anyone can offer a blade of grass.

You ask for a poem.

And so I write you a tragedy about

How a blade of grass

Becomes more and more difficult to offer,

And about how as you grow older

A blade of grass

Becomes more difficult to accept.

Brian Patten

(born 7 February 1946)

English Poet

%d bloggers like this: